జాతీయ వార్తలు

ఇవిగో ఆధారాలు ... సంఘటనా స్థలంలో రక్త చారికలే సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: భారత సైనికులపై పాక్ జరిపిన పైశాచిక దాడిని మరోసారి తీవ్ర పదజాలంతో ఖండించిన భారత్, ఆ దేశ హైకమిషనర్ బాసిత్‌కు సమన్లు పంపింది. ఇద్దరు భారత సైనికులపై దాడి జరిపింది పాకిస్తానీయులేనని రుజువు చేసే సాక్ష్యాధారాలను అందించింది. వీటి ఆధారంగా దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం డిమాండ్ చేసింది. ఇద్దరు భారతీయ సైనికుల తలలు నరికివేత వెనుక పాకిస్తాన్ సైనిక హస్తం ఉందన్న విషయాన్ని రుజువు చేసే ఆధారాలను అందించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బాసిత్‌కు తీవ్ర స్వరంతో తెలియ చేశామని, దోషులపై చర్య తీసుకోవాలని నిర్ద్వద్వంగా తెలియజేశామని తెలిపారు. భారతీయ సైనికులపై అమానుషంగా హతమార్చటం రెచ్చగొట్టే చర్యేనని, నాగరిక ప్రవర్తనకు ఇది పూర్తి విరుద్ధమని కూడా బాసిత్‌కు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. ఓ పథకం ప్రకారమే పాక్ సైనికులు ఆ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పే ఆధారాలను అందించామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సేకరించిన రక్త నమూనాలు మరణించిన భారత సైనికుల రక్తనమూనాలతో సరిపోలుతున్నాయని వెల్లడించారు. ఆక్రమిత పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించి ఇద్దరు సైనికుల తలలను నరికిన పాక్ సైనికులు, అదే మార్గంలో వెనక్కి వెళ్లారని చెప్పడానికి ఈ రక్తపు మరకలే సాక్ష్యమని వెల్లడించారు. అయితే రక్త నమూనాలు సంఘటన జరిగిన స్థలం మీదుగా కనిపించిన రక్త చారికలు ఒకే వ్యక్తివా అన్న విషయంలో బాగ్లే స్పష్టత ఇవ్వలేదు. అయితే, పాక్ పైశాచికత్వంపై తాము బలమైన ఆధారాలను అందించామని మాత్రం తెలిపారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఏమీ లేదని ఆ దేశ హైకమిషనర్ స్పష్టం చేశారన్నారు. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వ ఆగ్రహాన్ని, ఆవేదనను తమ ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. ఇద్దరు భారతీయుల తలలను నరికివేసింది పాకిస్తాన్ సైనికులేనని ఆధారాలు ఏమిటంటూ ఆ దేశం డిమాండ్ చేసిన నేపథ్యంలో భారత్ ఈ తాజా ఆధారాలను అందించింది. పాకిస్తాన్‌పై ఏ రకమైన చర్యలు చేపట్టబోతున్నారన్న దానిపై భాగ్లే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ‘వేచి చూడండి. ఆ చర్యలు ఏమిటో మీకే తెలుస్తాయి’ అని జవాబిచ్చారు. మరోపక్క ఓ ఎన్జీవో సంస్థ ఆహ్వానం మేరకు 50మంది పాకిస్తాన్ విద్యార్థులను వెనక్కి పంపేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈరకమైన కార్యక్రమాన్ని నిర్వహించటం ఎంతమాత్రం సమంజసం కాదని సదరు ఎన్జీవోకు విదేశాంత మంత్రిత్వ శాఖ స్పష్టం చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాకిస్తాన్ స్వ్కాష్, కుస్తీ బృందాలకు వీసాలను నిరాకరిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన బాగ్లే, స్కాష్ బృందానికి చాలా ముందుగానే వీసాలు మంజూరు చేశామని, అయితే వాటిని ఆ బృందం స్వీకరించలేదన్నారు. ఇక మల్లయోధుల బృందానికి వీసాల నిరాకరణపై స్పందించిన క్రీడా మంత్రి విజయ్ గోయల్ ‘ఉగ్రవాదం, క్రీడలు ఒకే ఒరలో ఇమడవు’ అని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని పాక్ గుర్తిస్తే మంచిదంటూ హితోపదేశం చేశారు. ఈ రెండు బృందాలు కూడా ఇక్కడ జరిగే ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా, ఉగ్రవాదం విషయంలో పాక్‌ను ఏకాకిని చేసే ప్రయత్నాలను భారత్ మరింతగా చేపడుతుందని బాగ్లే స్పష్టం చేశారు.

చిత్రం... బుధవారం ఆధీన రేఖ వద్ద గస్తీని ముమ్మరం చేసిన భారత సైనికులు