జాతీయ వార్తలు

చెప్పం.. చేసి చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీకారం తప్పదు చొరబాట్లు పెరిగాయి
నియంత్రిస్తున్నాం ఆర్మీచీఫ్ బిపిన్ రావత్

న్యూఢిల్లీ, మే 4: భారత సైన్యం తాను చేయాలనుకున్నది చేసి చూపిస్తుందని, ముందుగా తన ప్రణాళిక ఏమిటన్నది వెల్లడి చేయదని భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఇద్దరు సైనికుల శరీరాలను పాక్ సైన్యం ఛిద్రం చేసిన ఘటనపై ఆయన స్పందించారు. పాక్ దుశ్చర్యకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఆయన అన్నారు. 34్భవిష్యత్ ప్రణాళిక ఏమిటో మేం చెప్పం. అది అమలు చేసిన తరువాత కానీ బయటకు రాదు.2అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సాధారణంగానే ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. పిరికిపందల్లా పాక్ తీసిన దొంగదెబ్బకు గట్టి సమాధానం చెప్తామని ఆర్మీ వైస్ చీఫ్ శరత్‌చంద్ వ్యాఖ్యానించటం, అమరుల త్యాగాలు వృథా కానివ్వబోమని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ స్వయంగా హెచ్చరించటం, భారత దళాలు తగిన చర్య తీసుకుంటుందని పేర్కొన్న నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత సైనిక దళాలు పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు వివిధ అవకాశాలను పరిశీలిస్తోంది. గతంలో మాదిరిగా లక్షిత దాడులు చేసి టెర్రరిస్ట్ లాంచ్‌పాడ్‌లను ధ్వంసం చేస్తారా అన్న ప్రశ్నకు రావత్ నేరుగా జవాబివ్వలేదు. సరిహద్దుల్లో చొరబాటు యత్నాలు విపరీతంగా పెరిగాయని, వీటిని నిరోధించటానికి చర్యలు చేపట్టామని రావత్ వివరించారు. దక్షిణ కాశ్మీర్‌లోని సోఫియా జిల్లాల్లో పెద్ద ఎత్తున తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టారని అడిగిన ప్రశ్నకు రావత్ బదులిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావటం కోసమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని బ్యాంకుల్లో దోపిడీ జరిగింది. ఇందుకు పాల్పడ్డ వారికోసం గాలింపు కొనసాగుతోంది. కొందరు పోలీసులను చంపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టాం. అని రావత్ స్పష్టం చేశారు.