జాతీయ వార్తలు

గీత దాటితే విమానం ఎక్కనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: విమాన ప్రయాణాల సందర్భంగా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను మూడు నెలల నుంచి నిరవధిక కాలం వరకు అన్ని దేశీయ విమానాలలో ప్రయాణించకుండా నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. శివసేనకు చెందిన ఎంపి రవీంద్ర గైక్వాడ్ తనను బిజినెస్ క్లాస్‌లో కూర్చొని ప్రయాణించేందుకు అనుమతించని కారణంగా ఎయిరిండియా అధికారి ఒకరిని స్లిప్పర్‌తో 25సార్లు కొట్టిన సంఘటన నేపథ్యంలో కేంద్రం ఈ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ఇలాంటి దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల విమానయానంపై నిషేధం విధించేందుకు పౌర విమానయాన సంస్థ ‘నేషనల్ నో-ఫ్లై లిస్ట్’ను ప్రతిపాదించింది. సంబంధిత విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన కమిటీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు నిర్ధారించిన వ్యక్తుల పేర్లను ఈ జాబితాలో చేరుస్తారు. భద్రతా సంస్థలు ముప్పుగా గుర్తించిన వ్యక్తుల పేర్లను కూడా ఈ జాబితాలో చేరుస్తారు. జాతీయ స్థాయిలో రూపొందించే ఈ జాబితాలో అన్ని విమానయాన సంస్థలు నిర్ధారించిన దురుసుగా ప్రవర్తించే, విధ్వంసం సృష్టించే ప్రయాణికుల పేర్లు ఉంటాయి. కమిటీ సిఫారసు చేసిన నిషేధాన్ని అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలి.
ఇదో సృజనాత్మక చర్య అని, మరే దేశం ఇప్పటి వరకు ఇలాంటి చర్య తీసుకోలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ‘ప్రపంచంలో మరే దేశంలోనూ భద్రతా ఆధారంగా నో-ఫ్లై లిస్ట్ లేదు. మరే దేశంలోనూ ముప్పుగా పరిగణించిన వ్యక్తులు విమానప్రయాణం చేయకుండా నో-ఫ్లై లిస్టులు లేవు. ఈ విషయంలో భారత్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది’ అని సిన్హా విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం దురుసు ప్రవర్తనలను మూడు రకాలుగా విభజించి అందుకు అనుగుణంగా వారి విమాన ప్రయాణాలపై మూడు రకాల నిషేధాలను విధించింది. మాటలు, సంజ్ఞలతో వేధించడం, మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించడాన్ని మొదటి కేటగిరీలో చేర్చారు. ఇలాంటి వారిపై మూడు నెలల పాటు నిషేధం విధిస్తారు. తోయడం, కొట్టడం, అభ్యంతరకరంగా తాకడం లేదా లైంగికంగా వేధించడం వంటివాటిని రెండో కేటగిరిలో చేర్చారు. వీరిపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తారు. విమానం ఆపరేటింగ్ సిస్టంను ధ్వంసం చేయడం, భౌతికంగా హింసకు పాల్పడటం, హత్య చేసే ఉద్దేశంతో దాడికి పాల్పడటం, విమాన సిబ్బంది కంపార్ట్‌మెంట్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం వంటి వాటికి పాల్పడే వారిని మూడో కేటగిరిలో చేర్చారు. ఈ రకంగా ప్రవర్తించిన వారి విమాన ప్రయాణంపై రెండు సంవత్సరాల పాటు లేదా నిరవధికంగా నిషేధం విధిస్తారు. ఒక వ్యక్తి మొదటిసారి చేసిన స్థాయి నేరాన్ని మళ్లీ చేస్తే ఆ ప్రయాణికుడిపై నిషేధాన్ని రెండింతలు చేస్తారు.
ప్రయాణికుడి దురుసు ప్రవర్తన స్వభావాన్ని, విధించే శిక్షను సంబంధిత విమానయాన సంస్థకు చెందిన స్టాండింగ్ కమిటీ నిర్ణయిస్తుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. సంఘటన జరిగిన పది రోజుల్లోగా ఈ కమిటీ తాను నిర్ధారించిన అంశాలతో ముందుకు రావలసి ఉంటుంది. ఈ కాలంలో సదరు ప్రయాణికుడు విమానప్రయాణం చేయడానికి అనుమతించరు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు. పదవీ విరమణ పొందిన జిల్లా/ సెషన్స్ జడ్జి, వివిధ విమానయాన సంస్థలకు చెందిన ప్రతినిధి, ప్యాసెంజర్స్ అసోసియేషన్ లేదా వినియోగదారుల అసోసియేషన్ ప్రతినిధి లేదా రిటైర్డ్ కన్య్జూమర్ ఫోరం అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.