జాతీయ వార్తలు

ఉరే సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

నలుగురికీ మరణ శిక్ష ఖరారు వాళ్లది అత్యంత అమానుష చర్య
అరుదైన కేసు కిందికే వస్తుంది త్రిసభ్య ధర్మాసనం స్పష్టీకరణ

‘నిర్భయపై దాడి ఆటవికం, అమానుషం, రాక్షసకృత్యం. ఇది అత్యంత అరుదైన కేసు. అన్ని ఆధారాలు
పరిశీలించాం. బాధితురాలి మరణ వాంగ్మూలం
తిరుగులేని సాక్ష్యం’

నిర్భయ కేసు తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, మే 5: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. 23 ఏళ్ల యువతిపై జరిగిన దాడి అమానుషమైనది, అత్యంత క్రూరమైనదిగా న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంటూ, ఈ గ్యాంగ్‌రేప్, హత్య కేసు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికేలా చేసిందని, ఇది అత్యంత అరుదైన కేసుల కిందికి వస్తుందని వ్యాఖ్యానించింది. 2013లో ట్రయల్ కోర్టు నలుగురు నిందితులకు మరణ శిక్షను విధిస్తూ తీర్పు చెప్పగా ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టు అపీలు చేసుకోగా, హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్ బాధితురాలికి తగిలిన తీవ్ర గాయాలు, నిందితులు పాల్పడిన నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తాము మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నిందితులు బాధితురాలిని ఆటవస్తువుగా పరిగణించారని, ఆమెను నాశనం చేయడమే వారి ఏకైక లక్ష్యమని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. మృతురాలి మరణ వాంగ్మూలం కూడా ఒకే విధంగా ఉండడమే కాకుండా నిందితులు పాల్పడిన నేరాన్ని ఎలాంటి అనుమానాలకు తావులేని విధంగా నిరూపించిందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకూడదని, నేర తీవ్రత మొత్తం సమాజాన్ని కదిలించి వేసిందని, ప్రాసిక్యూషన్ తిరుగులేని సాక్ష్యాలను సమర్పించిందని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసు అత్యంత అరుదైన వాటి కిందికి తప్పకుండా వస్తుందని బెంచ్ వ్యాఖ్యానించడమే కాకుండా ఉరిశిక్షకు అర్హమైనదిగా ఏ కేసునైనా చెప్పాలంటే అది ఇదేనని కూడా స్పష్టం చేసింది. తనతో పాటుగా జస్టిస్ భూషణ్ తరఫున జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును వెల్లడించగా, జస్టిస్ భానుమతి మాత్రం వేరుగా తీర్పు ప్రకటించారు. అయితే నిందితులకు మరణ శిక్షను విధించాలన్న మిగతా ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. మహిళలకు ఎలా గౌరవం ఇవ్వాలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుంచి ఒక పద్ధతి ప్రకారం నేర్పాలని ఆమె తన తీర్పులో అభిప్రాయ పడ్డారు.
2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని నిర్భయపై ఆరుగురు వ్యక్తులు నడుస్తున్న బస్సులోనే అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమెతో పాటుగా ఆమెవెంట ఉన్న స్నేహితుడ్ని తీవ్రంగా గాయపరచిన దుండగులు వారిని బస్సులోంచి నడిరోడ్డుపైకి తోసేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. దేశ రాజధాని నడిరోడ్డుపై జరిగిన ఈ కిరాతకం దేశాన్ని కుదిపేసింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనేక చోట్ల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఆరుగురు నిందితుల్లో ఒకడైన రామ్‌సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా, మరొకరు బాలనేరస్థుడు కావడంతో రిమాండ్ హోమ్‌లో శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని విడుదలయ్యాడు. మిగతా నలుగురు నిందితులు ముకేష్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను ఢిల్లీ హైకోర్టు 2014 మార్చి 13న ధ్రువీకరించింది. హైకోర్టు తీర్పుపై నిందితులు దాఖలు చేసుకున్న అపీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత మార్చి 27న తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.