జాతీయ వార్తలు

చైనాకు సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 17: భారత్ గ్రేట్ పవర్ హోదా కావాలని గట్టిగా కోరుకుంటున్నందున భారత్, చైనాల మధ్య సంబంధాలు జటిలంగానే ఉంటాయని చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. గ్రేట్ పవర్‌గా ఎదగాలనే భారత్ వాంఛ చైనాకు సవాలుగా మారుతుందని ఆ పత్రిక బుధవారం సంచికలో ప్రచురించిన ఒక వ్యాసంలో తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్.. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటోందని, దీనివల్ల భారత్ గతంలోకన్నా మరింత ఎక్కువగా ముఖ్యమయిన పాత్ర నిర్వహించగలదని పేర్కొంది. మోదీ పాలనా యంత్రాంగం ప్రాంతీయ దృష్టిని మించి గ్రేట్ పవర్ హోదాకోసం కృషి చేస్తోందని పేర్కొంది. భారత్ శక్తివంతమైన పెద్ద దేశాలతో దౌత్యపరమైన సమతుల్యతను కొనసాగిస్తూనే అమెరికాతో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. చైనా, పాకిస్తాన్‌లపై ప్రధానంగా కేంద్రీకరించి సరిహద్దు భద్రతను పెంపొందించుకుంటోందని ‘ద గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. మరింత ఎక్కువమంది భాగస్వాములను తయారు చేసుకుంటూ, జపాన్, ఆస్ట్రేలియాలకు ప్రాధాన్యం ఇస్తూ భారత్ తన ఉత్పత్తులను పెంచుకుంటోందని తెలిపింది. చైనా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) వంటి అంతర్జాతీయ సంస్థలలో చేరడంద్వారా అంతర్జాతీయ పరిణమాలను ప్రభావం చేసే శక్తిని మరింత సాధించాలని భారత్ కోరుకుంటోందని పేర్కొంది. అయితే, అంతర్జాతీయ భద్రతా రంగంలో ప్రధాన శక్తిగా ఎదిగే ప్రక్రియలో, పాకిస్తాన్, చైనా, ఇతర పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలను కొనసాగించడం అనేది భారత్‌కు ఒక సవాలుగా మారుతుందని తెలిపింది. ప్రధానమంత్రి మోదీ, ఆయన బృందం రాజకీయ లక్ష్యానికి, ఆత్మవిశ్వాసానికి అనుగుణంగా భారతదేశ విదేశాంగ విధానం ఉందని, గొప్ప శక్తివంతమైన దేశంగా ఎదగాలనే భారత్ ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.