జాతీయ వార్తలు

అణు విద్యుత్ ఇక రెట్టింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అణు విద్యుత్, అణుపరిశ్రమలకు పెద్దపీట వేసేందుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. స్వదేశీ అణు పరిజానం (ప్రెషరైజ్డ్ హెవివాటర్ రియాక్టర్లు-పి.హెచ్.డబ్ల్యు.ఆర్)తో పది అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వలన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి కావడంతోపాటు అణు విద్యుత్ పరిశ్రమలకు చేయూత లభిస్తుంది. స్వదేశీ అణు పరిజానంతో నిర్మిస్తున్న పది అణువిద్యుత్ కేంద్రాలలో ఏడు వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో పని చేస్తున్న ఇరవై రెండు అణు విద్యుత్ కేంద్రాలద్వారా 6,780 మెగావాట్ల అణు విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల ద్వారా 2021-22 నాటికి మరో 6,700 మెగావాట్ల అణు విద్యుత్తు చేతికి వస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో మరో పది అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయంద్వారా అదనంగా మరో ఏడు వేల మెగావాట్ల అణు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా ఈ పది అణు విద్యుత్ కేంద్రాలను స్వదేశీ పరిజానంతో నిర్మించుకోవటం వలన దేశంలోని ఇంధన పరిశ్రమలకు దాదాపు డెబ్భై వేల కోట్ల రూపాయల ఆర్డర్లు లభిస్తాయి. స్వదేశీ అణు విద్యుత్ పరిజ్ఞానానికి మరింత పదును పెట్టుకునేందుకు పరిశ్రమలు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు అవకాశం లభిస్తుంది. ఈ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ఫ్లీట్ మోడ్ పద్ధతిలో చేపడతారని పియూష్ గోయల్ తెలిపారు. స్వదేశీ అణు పరిజ్ఞానంతో పది అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడం వలన దేశంలో 33,400 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. స్వదేశీ పరిజానంతో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించాలనే నిర్ణయం వలన భారత దేశం భారీ అణు ఉత్పాదక రంగంగా మారుతుందని తెలిపారు.
భారత ఆణువిద్యుత్ శాస్తవ్రేత్తలు కొత్తగా రూపొందించిన 700 మెగావాట్ల పి.హెచ్.డబ్ల్యు.ఆర్ అణువిద్యుత్ కేంద్ర పరిజ్ఞానంతో పది అణు విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తారు. నూతనంగా రూపకల్పన చేసిన ఈ అణు విద్యుత్ కేంద్రాల్లో అత్యాధునిక అణు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటతోపాటు అత్యున్నత భద్రతా స్థాయిని ఏర్పాటు చేస్తారు.