జాతీయ వార్తలు

కమ్ముకొస్తున్న యుద్ధమేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, మే 17: అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలన్న ఉత్తర కొరియా ఆకాంక్షల కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నందున ఆ దేశ సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయే-ఇన్ బుధవారం హెచ్చరించారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర, రాకెట్ తయారీ కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని వారం రోజుల క్రితం కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూన్ చెప్పారు. ఇప్పటివరకు ప్రయోగించిన లాంగ్‌రేంజ్ క్షిపణులన్నికన్నా అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణిగా చెప్పుకొంటున్న క్షిపణిని ఉత్తరకొరియా గత ఆదివారం ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలను, అణు బెదిరింపులను తాను ఎప్పటికీ సహించనని రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మూన్ చెప్పారు. కొరియా పశ్చిమ తీరంలోని వివాదాస్పద సముద్ర సరిహద్దు లేదా ఉభయ కొరియాలను వేరుచేసే భూ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు చెలరేగేందుకు ఎక్కువ అవకాశాలున్న వాస్తవ పరిస్థితిలో మనం ఇప్పుడున్నామని కూడా ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో అమెరికా ట్రంప్ ప్రభుత్వానికి, ఉత్తర కొరియా ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తీవ్రమైన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాపై సైనిక చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించగా, అదే గనుక జరిగితే పెద్దఎత్తున ఎదురుదాడి తప్పదని ఉత్తర కొరియా హెచ్చరించడం తెలిసిందే. వామపక్ష ధావాలు కలిగిన మూన్ ఉత్తరకొరియాతో చర్చలకు సానుకూలంగా ఉన్నప్పటికీ గత ఆదివారం ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష తర్వాత ఆ దేశం తన ప్రవర్తనను మార్చుకుంటేనే చర్చలు సాధ్యమని స్పష్టం చేశారు. 1950-53 మధ్య జరిగిన యుద్ధం తర్వాత కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినప్పటికీ కొరియాల మధ్య ఇప్పటికీ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉండడం గమనార్హం.