జాతీయ వార్తలు

ఐఏఎస్ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 17: యూపీ రాజధాని లక్నోలో హై సెక్యూరిటీ ప్రాంతమైన హజ్రత్‌జంగ్‌లో ఓ ఐఏఎస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కర్నాటక కేడర్‌కు చెందిన అనురాగ్ తివారీ (36) మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. అత్యంత విషాదం ఏమిటంటే పుట్టిన రోజునే ఆయన మృతి చెందడం. మీరాబాయ్ మార్గ్‌లోని ప్రభుత్వ అతిధి గృహంలో తివారీ ఉంటున్నారు. ఐఏఎస్ అధికారి మృతికి గల కారణాలు అనే్వషిస్తున్నట్టు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ దీపక్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ ఓ బ్యాచ్‌మెట్‌తో కలిసి ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్ర్తీ నేషనల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఓ శిక్షణ కార్యక్రమానికి హాజరై వచ్చారు. చనిపోయేటప్పుడు నైట్ డ్రస్‌లోనే ఉన్నారు. తివారీ గడ్డంపై చిన్నగాయం ఉందని ఎస్‌పి వెల్లడించారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లినప్పుడు ఏదైనా వాహనం ఢీకొని ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. బహ్రైచ్ జిల్లాకు చెందిన తివారీ ఇంజనీరింగ్ పట్ట్భద్రుడు. 1981 మే 17న జన్మించారు. 2007లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఐడి కార్డు, వ్యాలెట్ ఆధారంగా తివారీ మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వ్యాలెట్‌లో కొంత నగదు కూడా ఉందన్నారు. హార్ట్ అటాక్‌తో చనిపోయి ఉంటారని లక్నోరేంజ్ ఐజి జెఎన్ సింగ్ స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు విచారిస్తున్నారని ఆయన వెల్లడించారు.