జాతీయ వార్తలు

82వ ఏట.. ఇంటర్ పాసైన చౌతాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మే 17: టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కారాగార శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ సిఎం ఓం ప్రకాశ్ చౌతాలా (82) జైలునుంచే ఇంటర్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో అవినీతికి పాల్పడినట్టు తేలడంతో చౌతాలాకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తండ్రి ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడైనందుకు ఐఎన్‌ఎల్‌డి సీనియర్ నేత అభయ్ సింగ్ చౌతాలా హర్షం వ్యక్తం చేశారు. తీహార్ జైలులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా చౌతాలా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 23న ఇంటర్ పరీక్షలు రాశారు. పరీక్షల సమయంలో పెరోల్‌పై ఉన్న తరువాత జైలుకెళ్లారని కుమారుడు అభయ్ సింగ్ వెల్లడించారు. అలాగే మనవడు, హిస్సార్ ఎంపీ దుష్యంత్ సింగ్ చౌతాలా వివాహం పెళ్లి సందర్భంగా సీనియర్ చౌతాలా పెరోల్‌పై బయటకు వచ్చారు. ఈ నెల 5న ఆయన తిరిగి జైలుకెళ్లిపోయారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన కుంభకోణం కేసులో మాజీ సిఎం దోషిగా నిర్ధారణ అయింది. ఢిల్లీలోని తీహార్ జైలులో నాలుగున్నర ఏళ్లుగా ఉంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధ్యక్షుడిగా ఉన్న ఓం ప్రకాశ్ చౌతాలా చిన్నతనంలో చదువుసరిగ్గా సాగలేదు. ‘మా తాతగారు దేవీలాల్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, అలాగే కుటుంబ సమస్యలవల్ల ఓం ప్రకాశ్ చదువు సాగలేదు’ అని విపక్ష నేత అభయ్‌సింగ్ చౌతాలా తెలిపారు. తమ తండ్రి జైలులోని లైబ్రరీలో పుస్తకాలు, దినపత్రికలు చదువుతుంటారని ఆయన చెప్పారు.

ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడైన చౌతాలా బిఏ డిగ్రీ పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉన్నారు.