జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాఖ్‌ను కాదనే హక్కు మహిళలకుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ట్రిపుల్ తలాఖ్‌ను తిరస్కరించే హక్కు ముస్లిం మహిళలకు ఉందా అని సుప్రీంకోర్టు ధర్మాసనం అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డును ప్రశ్నించింది. ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టులో బుధవారం అయిదోరోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇస్లాం మతంలో భార్యలకు ట్రిపుల్ తలాఖ్‌ను తిరస్కరించే హక్కు ఉందా అని లా బోర్డు తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది. వివాహ సమయంలో ఈ షరతును చేర్చాలని కాజీలందరినీ ఆదేశించవచ్చా అనికూడా బెంచ్ ప్రశ్నించింది. ‘నిఖానామా (వివాహ ఒప్పందం)ను అమలుచేసే సమయంలో ట్రిపుల్ తలాఖ్‌ను ముస్లిం మహిళలు తిరస్కరించే అవకాశం ఇస్తారా?’ అని న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారిమన్, యుయు లలిత్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ కపిల్ సిబల్‌ను అడిగింది. అంతేకాదు తమవైపునుంచి ఎలాంటి సమాధానాన్ని ఆశించవద్దని కూడా బెంచ్ ఆయనకు స్పష్టం చేసింది. దీనికి బోర్డు న్యాయవాదుల బృందంలో ఒకరైన యూసఫ్ ముచాల సమాధానమిచ్చారు. బోర్డు ఆదేశాలన్నిటినీ కాజీలు పాటించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ 1400ఏళ్ల నాటి మత విశ్వాసమని మంగళవారం కపిల్ సిబల్ బెంచ్‌కి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
‘కోర్టు అడిగితే మా అభిప్రాయం చెప్తాం’
సుప్రీంకోర్టు కోరితే ట్రిపుల్ తలాఖ్ రద్దు విషయంపై తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయడానికి కమిషన్ సిద్ధంగా ఉందని జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మహిళా కమిషన్ ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకమని, దీన్ని రద్దు చేసి తీరాలని కమిషన్ సభ్యురాలు రేఖా శర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ కారణంగా చాలామంది ముస్లిం మహిళలు నష్టపోయారని, ఇప్పటికీ చాలామంది నష్టపోతూనే ఉన్నారని, అందువల్ల ఈ సంప్రదాయం పోవాలని మహిళా కమిషన్ కోరుకుంటోందని ఆమె అన్నారు. అంతేకాకుండా ట్రిపుల్ తలాఖ్ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో మహిళా జడ్జి లేకపోవడాన్ని కమిషన్ చైర్‌పర్సన్ ప్రశ్నించారని కూడా ఆమె చెప్పారు.