జాతీయ వార్తలు

గుంటూరు -గుంతకల్ డబ్లింగ్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి గుంతకల్ వరకు ఉన్న 402 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్‌తోపాటు విద్యుద్దీకరణ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ప్రాజెక్టును ఆమోదం తెలిపారు. గంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలిగించే రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను 3,631 కోట్ల ఖర్చుతో చేపడుతున్నారు. గుంటూరు- గుంతకల్ రైల్వే లైను డబ్లింగ్, విద్యుద్దీకరణకు అయ్యే ఖర్చును రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సగం సగం భరిస్తాయని కేంద్ర ఇంధన మంత్రి పియూష్ గోయల్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అమరావతిలో నిర్మిస్తోన్న ఏపీ కొత్త రాజధానిని రాయలసీమతో అనుసంధానించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని ఈ పథకం నెరవేర్చిందని పియూష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో కొత్త రాజధాని అమరావతికి రాకపోకలు మెరుగవుతాయన్నారు. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో దాదాపు 81లక్షల పని దినాలు ఏర్పాడతాయి. అలాగే, పథకాన్ని త్వరగా పూర్తిచేస్తే, ఈలైన్ మీదుగా కొత్త రైళ్లను ప్రారంభించవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రయాణికుల సౌకర్యం ఒకటైతే, నాలుగు జిల్లాల్లోని పరిశ్రమలకు అదనపు రవాణా సౌకర్యం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. నాలుగు జిల్లాల్లోని వివిధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు, ఇతర ప్రాంతాలకు మరింత సులభంగా రవాణా చేసేందుకు అదనపు సౌకర్యం ఏర్పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాది, ఈశాన్య భారతంలోని పలు ముఖ్యమైన నగరాల నుంచి బెంగళూరుకు వెళ్లటం మరింత సులభం కావటంతోపాటు దూరం తగ్గుతుంది.
వెంకయ్య సంతోషం
గుంటూరు- గుంతకల్ రైల్వే లైను డబ్లింగ్, విద్యుద్దీకరణ పథకానికి కేంద్ర ఆమోదం చెప్పటం పట్ల పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుతో నాలుగు జిల్లాలకు మేలు జరుగుతుందని, బెంగళూరుకు ప్రయాణాలు మెరుగవుతాయన్నారు.