జాతీయ వార్తలు

తొలి కాన్పుకు రూ. 6వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: గర్భిణీలు, బాలింతలకు రూ. 6 వేల చొప్పున మెటర్నిటీ బెనిఫిట్ అందించే కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. అయితే తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన వారికే పథకాన్ని పరిమితం చేసింది. ‘తొలిసారి గర్భిణి లేదా తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన బాలింతకు రూ.6 వేలదాకా నగదు ప్రయోజనం అందుతుంది. దీనిలో 5 వేల రూపాయలు మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మూడు వాయిదాల్లో ఇస్తుంది’ అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ తొలిసారి బిడ్డకు జన్మనిచ్చే మహిళల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అయితే తొలిసారి పుట్టిన ఇద్దరు బిడ్డలకు ఈ పైలట్ పథకం వర్తిస్తుందని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖనుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మూడు వాయిదాల్లో 5 వేల రూపాయల నగదు ప్రయోజనం గర్భిణీలు, బాలింతలకు అందుతుంది. మొదటగా గర్భం రిజిస్ట్రేషన్ తర్వాత మొదటి విడత కింద వెయ్యి రూపాయలు, ఆరు నెలల గర్భం తర్వాత ప్రతి నెలా జరిపే పరీక్షల్లో కనీసం ఒక పరీక్ష పూరె్తైన తర్వాత మరో 2 వేలు, బిడ్డ జననాన్ని రిజిస్టర్ చేశాక, తొలి విడత రోగ నిరోధక టీకాలు పొందిన తర్వాత మరో రెండు వేలు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం తర్వాత కూడా ఇప్పుడున్న పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మెటర్నిటీ బెనిఫిట్స్ కింద మిగతా నగదు ప్రోత్సహకం అందుతుందని, అంటే మొత్తంమీద సగటున ఒక మహిళకు రూ.6 వేలు లభిస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది.

చిత్రం... మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడిస్తున్న
పియూష్ గోయల్