జాతీయ వార్తలు

కులభూషణ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేగ్, మే 17: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) గురువారం తీర్పు ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యాయస్థానం తీర్పు వెలువరించనుందని భారత అధికారులు తెలిపారు. గూఢచర్యం ఆరోపణలపై పాక్ మిలిటరీ అధికారులు జాదవ్‌ను గత ఏడాది అరెస్టు చేశారు. పాక్ సైనిక న్యాయస్థానం ఆయనకు ఇటీవలే మరణ శిక్ష విధించింది. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ పూర్తి కావడానికి ముందే పాక్ జాదవ్‌ను ఉరి తీసే ప్రమాదముందని, అందువల్ల మరణ శిక్షను తక్షణం నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. కులభూషణ్‌ను ఉరి తీస్తే అది కుట్రపూరిత హత్యే అవుతుందని కూడా భారత్ వాదించింది. అంతేకాకుండా జైల్లోవున్న జాదవ్‌ను కలిసేందుకు కాన్సులర్ యాక్సెస్‌కు సైతం పాక్ అనుమతి ఇవ్వలేదని కూడా మన దేశం వాదించింది. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన ఒక గూఢచారికి కాన్సులర్ యాక్సెస్‌కు సంబంధించిన వియన్నా ఒడంబడికలోని నిబంధనలు వర్తింపజేయాల్సిన అవసరం లేదని పాక్ వాదించింది.