జాతీయ వార్తలు

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో తెలుగు విద్యార్థుల సమస్యల గురించి అమెరికా ప్రభుత్వంతో ఉన్నతస్థాయి చర్చలు జరపాలని సూచించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్న తెలుగు విద్యార్థులకు వీసా ఉన్నప్పటికీ యక్ష ప్రశ్నలతో వారిని వేధించటంతోపాటు అవమానించి వెనక్కి పంపించివేస్తున్నారు, దీనివల్ల తెలుగు విద్యార్థులు మానసికంగా దెబ్బ తింటున్నారని లేఖలో తెలిపారు. విద్యార్థులకు జరుగుతున్న అవమానాల గురించి అవమానాలపై ఎందుకిలా జరుగుతోందనేది కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందా? ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఆనంద భాస్కర్ ప్రశ్నలు కురిపించారు. విద్యార్థులు అమెరికాలో అవమానాలకు గురికాకుండా చూడాలంటే మొదట భారత్‌లో స్థానిక పాస్‌పోర్టు కార్యాలయంలోనే అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. వీసా లభించిన విద్యార్థులు అన్ని సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇప్పించవలసిన బాధ్యత విదేశాంగ శాఖపై ఉన్నదని భాస్కర్ సూచించారు. అమెరికాలో అవమానాలకు గురై తిరిగి వచ్చిన విద్యార్థుల విమాన చార్జీలను ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆనంద భాస్కర్ కేంద్ర మంత్రిని కోరారు.

గణతంత్ర వేడుకల దాకా ఢిల్లీలో హైఅలర్ట్
న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ప్రకటించిన హై అలర్ట్ రిపబ్లిక్ డే (ఈ నెల 26) దాకా కొనసాగుతుంది. నగరంలో దాడులు జరపడానికి ఉగ్రవాదులు జరిపే ఏ ప్రయత్నాన్నైనా భగ్నం చేయడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలి కాలంలో జైషే మహమ్మద్‌కు చెందిన ఆరునుంచి పదిమంది టెర్రరిస్టులు పాకిస్తాన్‌నుంచి పంజాబ్‌లోకి చొరబడి ఉండవచ్చంటూ ఇంటెలిజన్స్ నివేదికలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ పోలీసుల సమాచారం ప్రకారం పాకిస్తాన్‌నుంచి భారత్‌లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు 15 మందిదాకా ఉండవచ్చు. అందువల్ల రిపబ్లిక్ డే ముగిసే దాకా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులను కేంద్రం ఆదేశించింది.
దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఈ ఏడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండె ముఖ్య అతిథిగా విచ్చేయనున్న విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచడంతో కొన్ని విమానాల్లోకి అడుగుపెట్టే ముందు ప్రయాణికులు తప్పనిసరిగా రెండోసారి ల్యాడర్ చెకింగ్ జరిపించుకోవాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అంతేకాదు అనుమానాస్పద కదలిక లేదా వస్తువు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని పలు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అలాగే నగరంలోని ప్రధాన భవనాలను కాపలా కాసే సిఐఎస్‌ఎఫ్‌ను అదనపు బలగాలను మోహరించడం ద్వారా నిఘాను మరింత పెంచాలని కూడా ఆదేశించారు.

చోటా రాజన్ కేసు వివరాల వెల్లడికి సిబిఐ నిరాకరణ

న్యూఢిల్లీ, జనవరి 5: పాస్‌పోర్టును సంపాదించేందుకు తప్పుడు సమాచారాన్ని అందజేసి అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌పై కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) నుంచి తమకు మినహాయింపు ఉందని పేర్కొంటూ ఆ ఎఫ్‌ఐఆర్ వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. అయితే సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు పొందిన సంస్థల ఆధీనంలో ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని లేదా ఇతర ఆధారాలను తెలియజేయాల్సిందిగా ఎవరైనా కోరినప్పుడు ఆ సంస్థలు కూడా ఆర్‌టిఐ పరిధిలోకి వస్తాయని సమాచార హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. అయితే ఆర్‌టిఐ నుంచి మినహాయింపు పొందిన సంస్థలపై లేదా వాటి అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడే అవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయా? అన్నది సమాచార హక్కు చట్టం స్పష్టం చేయలేదు. సిబిఐ సరిగ్గా దీనినే ఆసరాగా చేసుకుని చోటా రాజన్ కేసు వివరాల వెల్లడికి నిరాకరించింది.