జాతీయ వార్తలు

ఏకీకృతాన్ని పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌కు జూన్ రెండోవారంలోగా రాష్టప్రతి ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చిం ది. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఇప్పటికే కేంద్ర న్యాశాఖ అంగీకారం తెలిపినందున, పిఎంవో, కేంద్ర హోంశాఖల ఆమోదం లభింపచేసి రాష్టప్రతి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్న తెలుగు రాష్ట్రాలకు విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్, హోంశాఖ డైరెక్టర్ అశుతోష్ మిశ్రా జైన్‌లు బుధవారం సమావేశమయ్యారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌పై రాష్టప్రతి ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించినందున, ఈ విద్యా సంవత్సరం అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాలు కోరాయి. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు రాష్టప్రతి ఆమోదం తీసుకొని త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పిఎంవో, హోం మంత్రి రాజ్‌నాథ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శితో వెంకయ్య ఫోన్‌లో సంప్రదించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. జూన్ రెండోవారంలోగా ఫైల్‌పై రాష్టప్రతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యేల చూస్తానని ఈ సందర్భంగా మంత్రులకు వెంకయ్య హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ వివాదం 20 ఏళ్లుగా నడుస్తొందని, దీనివల్ల పదోన్నతుల పక్రియలో ఇబ్బందులు ఏదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేంద్రానికి పరిస్థితి వివరించామని, రూల్స్ అమల్లోకి వస్తే విద్యా వ్యవస్థ పటిష్టం చేయవచ్చన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌పై కేంద్ర న్యాయశాఖ అంగీకరం తెలిపినందున, మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి రాష్టప్రతి ఆమోదం పొందేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న డిటెన్షన్ విధానంపై సామాజికాంశాలు ముడిపడి ఉన్నందున, దానిపై మరోసారి చర్చిస్తామని గంటా తెలిపారు. సమావేశంలో ఎంపీ సిఎం రమేష్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస్‌నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం....
ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదాన్ని పరిష్కరించాలని
కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞాపన పత్రాలు అందిస్తున్న
తెలుగు రాష్ట్రాల మంత్రులు కడియం, గంటా