జాతీయ వార్తలు

పాక్ అణ్వస్త్ర స్థావరం గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: అణ్వాయుధాలను నిల్వ చేయడం కోసం పాకిస్తాన్ రహస్యంగా నిర్మిస్తున్న స్థావరం గుట్టు రట్టయింది. ఖైబర్ ఫక్తూన్ ఖ్వా రాష్ట్రంలోని హరిపూర్ పీర్‌థాన్ పర్వత శ్రేణుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్థావరం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఉపగ్రహ చిత్రాల ఆదారంగా మిలిటరీ ఇంటెలిజన్స్ వర్గాలు ఈ స్థావరాన్ని గుర్తించగలిగాయి. పాకిస్తాన్ తన ఖండాంతర క్షిపణి అయిన షహీన్-3 బాలిస్టక్ క్షిపణులను ఇక్కడ భద్రపరచి ఉండవచ్చని భారత మిలిటరీ ఇంటెలిజన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాలను నిఘా వర్గాలు విశే్లషించినప్పుడు ఈ విషయం నిర్ధారణ అయింది. షహీన్-3 క్షిపణికి 2,750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దీని సాయంతో భారత్‌లోని అండమాన్ దీవులపై కూడా దాడి చేయవచ్చు. అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర క్షిపణులను ఇక్కడ భద్రపరచడమంటే అది భారత్‌కు ముప్పుగానే భావించవచ్చు. ఎందుకంటే ఈ రహస్య స్థావరం అమృత్‌సర్‌కు 320 కిలోమీటర్లు, దేశ రాజధాని ఢిల్లీకి 720 కిలోమీటర్ల దూరంలో ఉంది. శత్రువుపై తొలిసారి దాడి చేసే సామర్థ్యాన్ని పాక్ బలోపేతం చేసుకుని ప్రతిదాడి చేసేందుకు సైతం ఏర్పాట్లు చేసుకుంటోందని చాలాకాలంగా వార్తలు వస్తూ ఉన్న విషయం తెలిసిందే. భారత్ దాడినుంచి తన అణ్వస్త్రాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఇలాంటి ఎన్నో రహస్య స్థావరాలను నిర్మించుకున్నట్లు కూడా ఆ వార్తలు పేర్కొంటున్నాయి. కాగా, ప్రస్తుతం మిలిటరీ ఇంటెలిజన్స్ వర్గాలు కనుగొన్న ఈ రహస్య స్థావరంలో రెండు సొరంగాలు, మూడంచెల కంచె, ఒక కార్యాలయం లాంటివి ఉన్నాయి. 2003లో ఈ రహస్య స్థావరాన్ని పాక్ నిర్మించడం ప్రారంభించింది. 2011 నాటికల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. పాకిస్తాన్ వద్ద అధికారిక అంచనా ప్రకారం 150 దాకా అణ్వస్త్రాలు ఉన్నాయి. అయితే అనధికారికంగా ఇంకెన్ని ఉన్నాయో తెలియదు.