జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి దవే హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే గురువారం హఠాత్తుగా మృతి చెందారు. ఆయనకు 60 ఏళ్లు. గురువారం ఉదయం అనారోగ్యంగా ఉన్న ట్లు దవే చెప్పడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయన అక్కడ మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దవే 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత ఏడాది జూలైలో జరిపిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా దవేను పర్యావరణ, అటవీ శాఖ మంత్రి గా నియమించారు. బ్రహ్మచారి అయిన దవే మృతి వార్తను ఒక ట్వీట్‌లో అందరికన్నా ముందుగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ తాను నిన్న సాయంత్రం పొద్దుపోయే దాకా కూడా మంత్రితోనే విధానపరమైన అంశాలను చర్చిస్తూ ఉండినట్లు తెలిపారు. ఆయన అకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని దవే మృతి తనకు వ్యక్తిగతంగా పెద్ద లోటని పేర్కొన్నారు.
కాగా, దవేను ఉదయం 8.50 గంటల సమయంలో ఎయిమ్స్‌కు తీసుకు వచ్చారని, గుండె ఆగిన స్థితిలో ఆయనను తీసుకు వచ్చారని, ఆయనను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఉదయం 9.45 గంటల సమయంలో దవే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. దవే మృత దేహాన్ని సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఆయన నివాసానికి తీసుకెళ్లి అంతిమ దర్శనం కోసం అక్కడ కొద్ది గంటలు ఉంచిన తర్వాత అంత్యక్రియల కోసం ఆయన సోదరుడు ఉంటున్న ఇండోర్‌కు విమానంలో తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దవే మృతి వార్త తెలియగానే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నరేంద్ర సింగ్ తోమార్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, తన్వర్ చంద్ గెహ్లోట్, హర్షవర్ధన్, పలువురు బిజెపి సీనియర్ నేతలు ఎయిమ్స్‌కు చేరుకున్నారు.