జాతీయ వార్తలు

మరణ శిక్ష ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది హేగ్,మే 18: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్ష విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తొలి విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. ఈ కేసును పూర్తిగా విచారించి తుది ఆదేశాలు జారీ చేసే వరకూ జాధవ్‌కు మరణ శిక్ష విధించడానికి వీల్లేదని అంతర్జాతీయ కోర్టు ఏకగ్రీవంగా పాకిస్తాన్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి తన పరిధిలోని అన్ని అధికారాలు వినియోగించి మరణ శిక్ష అమలును ఆపాలని ఐసిజె అధ్యక్షుడు రోన్ని అబ్రహం తేల్చిచెప్పారు. ఈ కేసులో జాధవ్ హక్కులకు పూర్తిగా భంగం కలిగే అవకాశం కనిపిస్తోందని, అయనతు వియన్నా ఒడంబడిక ప్రకారం కాన్సులర్ సహాయాన్ని పొందే అవకాశం కల్పించి ఉండాల్సిందని తెలిపారు. జాధవ్ కేసును తేల్చే న్యాయపరమైన అధికారం తమకు ఉందని విస్పష్టంగా తెలియజేశారు. అయితే జాధవ్ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులు గందరగోళమయంగా ఉన్నాయని పేర్కొంటూ తీర్పు పాఠాన్ని చదివి వినిపించారు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలోనే జాధవ్‌కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందంటూ భారత్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు ఈ మేరకు రూలింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ నెల 9నే జాధవ్ మరణ శిక్షను ఈ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు రోజుల విచారణ అనంతరం అధికారికంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జాధవ్ ప్రాధమిక హక్కులకు తీవ్రస్థాయిలో భంగం కలిగిందని, న్యాయ సహాయం, దౌత్య కేంద్రాన్ని సంప్రదించే విషయంలో ఆయనకు ఎలాంటి అవకాశం లభించలేదని ఐసిజె తన తీర్పులో తెలిపింది. ఇందుకు సంబంధించి 16సార్లు భారత్ అభ్యర్థించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. జాధవ్ విషయంలో వియన్నా ఒడంబడికను పాక్ ఉల్లంఘించిందన్న భారత వాదనను బలపరిచింది. 1977 నుంచి వియన్నా ఒప్పందంలో భారత్-పాక్‌లు భాగస్వామ్య దేశాలుగా ఉన్న విషయాన్నీ ప్రస్తావించింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువడిన వెంటనే భారత్‌లో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడారు. ఐసిజెలో భారత్ తరపున బలమైన వాదన వినిపించిన లాయర్ హరీష్ స్వాల్వేకు, ఆయన సారధ్యంలోని బృందానికి అభినందనను తెలిపారు. జాధవ్ ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలో భారత దేశం ఇందుకోసం శాయశక్తులు వినియోగించి కృషి చేస్తుందన్నారు. ఐసిజె తీర్పు జాధవ్ కుటుంబానికి, మొత్తం దేశానికే ఎంతో ఊరటనిచ్చిందన్నారు.

chitram....
1. తీర్పునిస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రొన్ని అబ్రహం

2. ముంబయలో సంతోషం వ్యక్తం చేస్తున్న జాధవ్ చిన్ననాటి స్నేహితులు