జాతీయ వార్తలు

అది భారత్‌పై దాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగింది ఉగ్రవాదుల దాడి కాదనీ, అది భారత్‌పై జరిగిన దాడి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రదాడి మామూలు సంఘటన కాదన్నారు. దేశ భద్రత దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌కు కలుగుతున్న పలు అనుమానాలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని ఆనంద్ శర్మ తెలిపారు. భారతదేశానికి చెందిన ఒక అతిపెద్ద ఎయిర్ బేస్‌పై దాడి జరగటం అంటే భారతపై దాడి జరిగినట్లు కాదా? అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ఎయిర్ బేస్‌ను రక్షించటంలో విజయం సాధించిన సైనిక, ఎన్‌ఎస్‌జి, ఇతర భద్రతా సిబ్బందిని ఆయన ప్రశంసించారు. భారత్‌పై కుట్ర జరుగుతోంది, ఈ కుట్రలో భాగంగానే పఠాన్‌కోట్ ఏయిర్ బేస్‌తోపాటు అఫ్గానిస్తాన్‌లోని మజారె షరీఫ్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి జరిగింది, ఇదంతా చూస్తుంటే కుట్ర జరుగుతోందనేది స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ఈ సంఘటనల నేపథ్యంలో పఠాన్‌కోట్ ఏయిర్ బేస్‌పై జరిగిన దాడిని భారత దేశంపై జరిగిన దాడిగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ దాడిని అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఖండించాలని ఆయన సూచించారు. గత ఆగస్టు నెలలో జరగవలసిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేసిన అనంతరం వారు బ్యాంకాక్‌లో కలిసినప్పుడు ఇకమీదట ఉగ్రవాద దాడులు జరిగితే రెండు దేశాలు ఎలా వ్యవహరించాలి, ఎలా స్పందించాలనేది నిర్ణయించారా? అని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ఏ హామీ ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లాహోర్‌కు వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపారని పశ్నించారు. హిందుస్తాన్ ప్రధాని లాహోర్ గడ్డపై 25వ తేదీన అడుగుపెట్టినప్పుడు అక్కడ పాకిస్తాన్ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు జనరల్ జాంజువా అక్కడ లేరు, ఈ సంఘటన ఆధారంగా పరిస్థితులను ఎందుకు అర్థం చేసుకోలేదు? పాకిస్తాన్ భద్రతా వ్యవహారాల సలహాదారు ఇద్దరు ప్రధాన మంత్రుల శాంతి చర్చలను సమర్థించటం లేదనేది అర్థం చేసుకోలేకపోయారా? అని ఆనంద్ శర్మ నిలదీశారు. ముంబయిపై దాడి జరిగిన అనంతరం పాకిస్తాన్ స్పష్టమైన హామీ ఇవ్వనంత వరకు ద్వైపాక్షిక చర్చలు జరపకూడదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ముంబయి దాడుల కుట్ర పన్నిన లఖ్వీని శిక్షించాలన్న మన డిమాండ్‌ను పాకిస్తాన్ ఇంతవరకు గౌరవించలేదని తెలిపారు. పాకిస్తాన్ భూభాగం నుండి కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, వాటిని నిర్వహిస్తున్న సంస్థలను అదుపు చేయాలనే డిమాండ్‌ను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం గౌరవించలేదని ఆనంద్ శర్మ తెలిపారు. నరేంద్ర మోదీ ఆకస్మిక లాహోర్ పర్యటన ఒక నాటకమని ఆయన దుయ్యబట్టారు. చారిత్రక అంశాల దృష్టా రెండు దేశాల సంబంధాలు చాలా చిక్కులతో కూడుకున్నవని చెప్పారు. సలహాదారులు మంచి సలహాలు ఇవ్వాలి కానీ తరువాత సిగ్గుపడే పరిస్థితులు కల్పించకూడదని ఆనంద్ శర్మ చెప్పారు. పాకిస్తాన్‌లో మూడు అధికార కేంద్రాలున్నాయి కాబట్టే సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

పఠాన్‌కోట్ దాడిపై
పాకిస్తాన్‌కు ఎల్‌ఆర్
న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రదాడికి సూత్రధారులుగా వ్యవహరించిన వారిని పట్టుకునేందుకు వీలుగా ఈ దాడిలో హతమైన ముష్కరుల డిఎన్‌ఎ శాంపిళ్లు, వారి ఫోన్ కాల్స్ వివరాలతో పాటు పాకిస్తాన్ నుంచి ఈ దాడులకు సహకరించిన వారి వివరాలతో దాయాది దేశానికి భారత్ ఎల్‌ఆర్ (లెటర్ రొగేటరీ)ను పంపనుంది. పాక్ అధికారులు తమ దేశంలో ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ దాడిలో హతమైన ఆరుగురు ఉగ్రవాదులకు సాధ్యమైనంత త్వరగా డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ ముష్కరులు ఫోన్ల ద్వారా పాక్‌లో ఎవరితో మాట్లాడారన్న వివరాలను కూడా సిద్ధం చేస్తున్నామని, ఈ వివరాలన్నింటినీ లెటర్ రొగేటరీ ద్వారా పాకిస్తాన్‌కు అందజేయడం జరుగుతుందని అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి.