కృష్ణ

ఎమ్మెల్సీలే రథసారథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 19: అధికార తెలుగుదేశం పార్టీ పగ్గాలు మళ్లీ వాళ్లకే అందనున్నాయి. మరో రెండు రోజుల్లో జరగనున్న టిడిపి జిల్లా, విజయవాడ నగర కమిటీ ఎన్నికల్లో మళ్లీ పాత వారికే పట్టం కట్టేందుకు అధిష్ఠానం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, విజయవాడ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న మరో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలనే తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు కూడా ఆమోదముద్ర వేశారు. జిల్లాలో అశావహులు ఉన్నప్పటికీ రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా సమర్థులుగా పేరు తెచ్చుకున్న వీరు ఇరువురైతేనే పార్టీకి మేలు జరుగుతుందని భావించిన అధిష్ఠానం ఆ మేరకు ఏకగ్రీవం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీరామరాజు ఫంక్షన్ హాలులో జిల్లా కమిటీ, సాయంత్రం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో విజయవాడ నగర కమిటీ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అధ్యక్షులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శులనే మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. కొద్దిపాటి మార్పులతో ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. పార్టీకి విధేయుడుగా ఉన్న బచ్చుల అర్జునుడుకు ఇటీవల ఎమ్మెల్సీగా అధిష్ఠానం అవకాశం కల్పించింది. గడిచిన రెండేళ్లల్లో ప్రజా ప్రతినిధులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోనే కృష్ణాజిల్లాకు పార్టీ పరంగా మంచిపేరు తీసుకువచ్చారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వాల నమోదులో జిల్లాలో 6.42లక్షల మేర సభ్యత్వాలు చేపట్టి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను సైతం తన వాగ్ధాటితో తిప్పుకొడుతూ అధిష్ఠానం మన్ననలు పొందారు. విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బుద్ధా వెంకన్న కూడా అధిష్ఠాన ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ వచ్చారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన బుద్ధాకే తిరిగి పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయించినా పార్టీలో ఎక్కడా వ్యతిరేక లేకపోవడం విశేషం. బచ్చుల అర్జునుడు ఎన్నికను కొంత మంది తెర వెనుక విమర్శించినా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లే సాహసం చేయలేదు. దీంతో అర్జునుడుకు లైన్ క్లియరైంది.