జాతీయ వార్తలు

మణిపూర్‌లో కేంద్ర బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్/న్యూఢిల్లీ, జనవరి 5: మణిపూర్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసిన పెను భూకంపం వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడంతోపాటు తక్షణమే సహాయ చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలు సన్నద్ధమయ్యాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతో సంభవించిన భూ కంపంలో 8 మంది మృతి చెందారు. అనేక రహదారులు, భవనాలు బీటలువారాయి. జాతీయ విపత్తుల నిరోధక దళానికి (ఎన్‌డిఆర్‌ఏ) చెందిన సహాయక బృందాలు మణిపూర్‌కు తరలివచ్చాయి. కుప్పకూలిన భవనాలు శిథిలాలు తొలగించడంతోపాటు వాటిలో చిక్కుకుపోయిన అనేకమందిని యుద్ధ ప్రాతిపదికన రక్షించే చర్యలు చేపట్టాయి. ప్రమాదం మూల కేంద్రంగా ఉన్న తమెన్‌గ్లాంగ్ జిల్లాలో అత్యధిక స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇక్కడ ప్రత్యేక బృందాలు మోహరించడంతో పాటు అస్సాంలోని సిల్చార్ వద్ద కూడా సహాయ చర్యలను వేగవంతం చేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సిబ్బంది సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మణిపూర్ సచివాలయంలోని అనేక భవనాలు భూకంప ప్రభావానికి బీటలు వారాయని అలాగే ప్రసిద్ధ ఈమా మార్కెట్ కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అనేక పాఠశాల భవనాలు కుప్పకూలిపోవడంతో మంగళవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు. కేంద్రానికి చెందిన వివిధ వైద్య బృందాలు మణిపూర్‌కు తరలివచ్చి చికిత్సా కార్యక్రమాలు చేపట్టాయి. దాదాపు వందమందికి పైగా భూకంపంతో గాయపడడంతో ప్రత్యేక వైద్య బృందాలను కేంద్రం తరలించింది. గాయపడ్డవారిలో 33 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కొందరిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దెబ్బతిన్న భవనాలు సురక్షితమైనవా కాదా అన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి జాతీయ విపత్తుల మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎన్‌ఏ) నిపుణుల బృందాన్ని తరలించింది. మరోపక్క రాష్ట్రంలో చేపడుతున్న సహాయ చర్యలను కేంద్ర హోమ్ శాఖ వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా పర్యవేక్షిస్తోంది. మరోపక్క జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఈశాన్య భారతంలో భూకంప అనంతర పరిస్థితిపై చర్చించింది.

సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తాకిడికి ఇంఫాల్‌లో కూలిన ఇళ్లు