జాతీయ వార్తలు

మళ్లీ ఆక్రమిత పాక్‌పై లక్షిత దాడులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి నోట సంకేతాలు
గతంలో చెప్పామా..ఇప్పుడు కూడా ముందే చెప్పం
స్పష్టం చేసిన జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ, మే 21: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై మరోసారి లక్షిత దాడులకు భారత్ సన్నద్ధమవుతోందా? కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాటల్లో ఇందుకు అవునన్న సంకేతాలే వ్యక్తమవుతున్నాయి. ‘కచ్చితంగా ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. అయితే ప్రభుత్వం ముందు గా తన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించదు’అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం చర్యల్ని చేపడుతుందా అన్న ప్రశ్నకు ‘అవును..చేపడతాం’అని ఆయన జవాబిచ్చారు. ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై మొదటిసారి సర్జికల్ దాడులు జరిపినప్పుడు ప్రభుత్వం ముందుగానే చెప్పలేదు కదా..ఆ చర్యలు చేపట్టిన తర్వాతే అసలు విషయం బయటికి వచ్చింది’ అని అన్నారు. ఆదివారం ఇండియా టుడే ఎడిటర్స్ రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడిన జితేంద్ర సింగ్ ‘మేము ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో..ముందుగా చెప్పం’ అని ఉద్ఘాటించారు. అయితే కచ్చితంగా నిర్ణయాత్మక చర్యలే ఉంటాయనడంలో ఎలాంటి సందేశం లేదని..అవి ఎలా ఉంటాయే వెల్లడించలేదని అన్నారు. ‘పరిస్థితిని బట్టి భద్రతా దళాలే తగిన చర్యలు చేపడతాయి. ఫలితాలను మీరే చూస్తారు’ అని జితేంద్ర సింగ్‌ను ఉటంకిస్తూ ఇండియా టుడే పత్రిక తెలిపింది. ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో పాలుపంచుకోవాలన్న ఆకాంక్ష కాశ్మీరీ యువతలో ఉందని, కానీ కాశీర్ లోయలో 350కు మించని శక్తులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని, అల్లర్లు రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.