జాతీయ వార్తలు

30నే కేరళకు రుతు పవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐఎండి అంచనాలకు
రోజు ముందే తాకే అవకాశం

న్యూఢిల్లీ, మే 23: ఈ ఏడాది రుతు పవనాలు మే 30న కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐఎండి ప్రకటించిన తేదీకన్నా ముందే రుతుపవనాలు కేరళకు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రాజీవన్ అన్నారు. ‘రుతుపవనాల రాక తేదీ మే 30గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక రోజు ముందే కేరళను తాకవచ్చు’ అని ఆయన అన్నారు. మామూలుగా రుతుపవనాలు కేరళను తాకే తేదీ జూన్ 1. కాగా, ఎల్ నినో ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని ఐఎండి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ రుతుపవనాలనుంచి క్లౌడ్‌సీడింగ్ సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఒక కార్యక్రమాన్ని తమ శాఖ ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తమ శాఖ సాధించిన విజయాలను వివరించడం కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజీవన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి హర్షవర్ధన్, ఆ శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి కూడా పాల్గొన్నారు. రెండు పరిశోధన విమానాలను ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రాజీవన్ చెప్పారు. ఒక విమానాన్ని క్లౌడ్ సీడింగ్‌కోసం ఉపయోగిస్తారని, రెండో విమానం అధ్యయనం కోసం శాంపిల్స్ సేకరిస్తుందని ఆయన చెప్పారు. ఈ పరిశోధన కొనసాగించడం కోసం మహారాష్టల్రోని సోలాపూర్‌ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మూడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.