జాతీయ వార్తలు

రోజర్ మూర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: జేమ్స్‌బాండ్ పాత్రలో సినీ అభిమానులను అలరించిన అలనాటి నటుడు రోజర్ మూర్ మంగళవారం కన్నుమూశారు. 89ఏళ్ల మూర్ దీర్ఘకాలంగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా రు. మంగళవారం స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచినట్టు ఆయన సంతానం ఒక ప్రకటనలో వెల్లడించారు. నాలుగుసార్లు వివాహం చేసుకున్న ఆయనకు కుమార్తె, ఇద్దరు కుమారులు, భార్య క్రిస్టినా థొల్‌స్ట్రప్ ఉన్నారు. మూర్ చివరి కోరిక మేరకు మొనాకోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా బ్రిటన్‌లో పుట్టిపెరిగిన ఆయన హాలీవుడ్ తారగా ఎదగడానికి జేమ్స్‌బాండ్ చిత్రాలు దోహదపడ్డాయి. వెండితెరపై బ్రిటిష్ గూఢచారి జేమ్స్‌బాండ్ పాత్రలో రాణించి తనదైన ముద్ర వేసిన రోజర్‌మూర్, 1973 నుంచి 1985 మధ్యకాలంలో మొత్తం ఏడు జేమ్స్‌బాండ్ సిరీస్‌లలో తిరుగులేని నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. తరువాత ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన మూర్ ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1991లో యునిసెఫ్ అంబాసిడర్‌గా నియమితులై మూడేళ్లపాటు సేవలందించారు. జేమ్స్‌బాండ్ పాత్రల్లో నటించిన మూడో నటుడిగా, అంతకుముందు తరువాత నటించిన వారికన్నా మేటిగా మన్ననలు అందుకున్న రోజర్‌మూర్ వెండితెరపైకి రాకముందు బుల్లితెరపైనా రాజ్యమేలారు. రోజర్‌మూర్ మాతృమూర్తి లిల్లీ మన దేశంలోని కోల్‌కతాలో జన్మించడం ఓ విశేషం.