జాతీయ వార్తలు

నయాపైసా తీసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: డిడిసిఏ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో ఐదుగురు తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు చేశారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం కోర్టులో స్పష్టం చేశారు. తాను డిడిసిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎవరి నుంచి ఏ రకమైన ఆర్థిక లబ్ధిని పొందలేదని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తును తప్పుదోవపట్టించే ఉద్దేశంతోనే కేజ్రీవాల్ తదితరులు ఈ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపారు. కేజ్రీవాల్‌తోపాటు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్‌పాయ్‌లపై జైట్లీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాను డిడిసిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిధులను దారి మళ్లించానని ఆ విధంగా లబ్ధి పొందినట్టుగా వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. భారీ భద్రత మధ్య ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు జైట్లీ హాజరయ్యారు. కేజ్రీవాల్ తదితరులపై తాను వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి తన వాదనను గట్టిగా వినిపించారు. ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం నిర్మాణం సమయంలో తాను డిడిసిఏ అధ్యక్షుడిగా ముడుపులు తీసుకున్నానని కేజ్రీవాల్ చెప్పడం సత్యదూరమని ఆర్థిక మంత్రి అన్నారు. స్టేడియం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పడిందని అసలు ఆ కమిటీలో తాను సభ్యుడినే కానని జైట్లీ వివరించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు సాక్షిగా హాజరైన సీనియర్ పాత్రికేయుడు రజత్ శర్మ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.

వాంగ్మూలం ఇచ్చేందుకు ప్రధాన
మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు
వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ