ఆంధ్రప్రదేశ్‌

ఏ రాష్ట్రానికీ చేయనంత చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లులో పేర్కొన్న అంశాలతో పాటు, లేనివాటిని కూడా చేర్చి దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధం గా ఆంధ్రప్రదేశ్‌కు ముందెన్నడూ ఎరుగని రీతిలో భారీఎత్తున నిధులను ప్రవహింపచేస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రకటించారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం జరిగిన పోలింగ్ బూత్ కార్యకర్తల మహా సమ్మేళనంలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ 12కోట్ల సభ్యత్వంతో బిజెపి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా విలసిల్లుతున్నదంటూ, తక్షణం ఎన్నికలొచ్చినా 360 స్థానాలతో సొంత బలంతోనే అధికారంలోకి రాగలదంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు ఈ దేశాన్ని 50 ఏళ్లు పైగా పాలించిన అవినీతిమయమైన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించిందని, అదే బిజెపి ప్రభుత్వంపై గడచిన మూడేళ్లుగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. బిజెపి పట్ల చాలామందిలో నిన్న, మొన్నటివరకు ఉత్తరాది పార్టీఅని, నగరవాసుల పార్టీఅని, చదువుకున్నవారి పార్టీఅనే అభిప్రాయం ఉండేదన్నారు. అలాంటిది నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రావటమే కాకుండా, 13 రాష్ట్రాల్లో సొంత బలంతోనూ, నాలుగు రాష్ట్రాల్లో మిత్రుల సహకారంతోను అధికారంలో ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఓ మహత్తర శక్తిగా ఎదిగి రాబోయే రోజుల్లో అండమాన్ దీవులు, పుదుచ్చేరి నుంచి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విజయపథంలో పయనించటం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత శక్తిమంతమైన పార్టీగా తయారుచేసే సత్తా కార్యకర్తలకు ఉందంటూ ప్రశంసించారు. ప్రధాని మోదీ సుపరిపాలనతో అవినీతిపరుల భరతం పడుతూ వారి పట్ల అరివీర భయంకరునిగా మారారన్నారు. క్రైస్తవులు, ముస్లింలకు బిజెపి వ్యతిరేకం కాదు. ఈ దేశాన్ని ప్రేమించే దేశభక్తులందరినీ దరిచేర్చుకుంటుందన్నారు.