జాతీయ వార్తలు

30న హాజరుకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 25: బాబరీ మసీదు విధ్వంసం కేసులో కుట్రపరమైన అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలు ఈ నెల 30 జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని లక్నో కోర్టు గురువారం నిర్ద్వంద్వంగా తెలిపింది. వ్యక్తిగత హాజరీ విషయంలో వీరికి ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బాబరి అంశాన్ని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి విచారణకు చేపట్టిన సమయంలో శివసేనకు చెందిన మాజీ చట్టసభ సభ్యుడు సతీష్ ప్రధాన్ మాత్రమే ఉండటంతో ఆయన మేరకు ఆదేశాలు జారీ చేశారు. అభియోగాల నమోదు కోసం జరిగే తదుపరి విచారణకు కచ్చితంగా హాజరుకావాలని మిగతా నిందితుల్ని కూడా కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత హాజరీ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని న్యాయమూర్తి తెగేసి చెప్పారు. అద్వానీతో పాటు మిగతావారిపైనా అభియోగాల విచారణను పునరుద్ధరించాలని గత నెల్లో సుప్రీం రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ కేసు విచారణ పూర్తి కావాలనీ ఆదేశించింది. అద్వానీ తదితరులపై కుట్ర అభియోగాలను 2001లో సిబిఐ ప్రత్యేక కోర్టు తొలగించింది. వాటిని 2010లో అలహాబాద్ హైకోర్టు పునరుద్ధరించింది. బిజెపి సీనియర్ నేతలు కుట్రపరమైన అభియోగాల విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో కధ మొదటికొచ్చింది.