జాతీయ వార్తలు

జనం మెచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని విషయాల్లోనూ సమర్థించారు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గను ప్రతిరోజూ ఓ నవోదయమే
అన్ని రంగాల్లోనూ ఆశావాదం మాటలతో అభివృద్ధి జరగదు అసోం ర్యాలీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

గౌహతి, మే 26: దేశ ప్రజల్లో నిరాశ నిస్పృహలను తొలగించి బలమైన ఆశావాదాన్ని పాదుకొల్పామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మూడేళ్ల కాలంలో తాము చేపట్టిన ప్రతి నిర్ణయంలోనూ ప్రజలను భాగస్వాములను చేశామని, ఆవిధంగా వారిలో భవిష్యత్ పట్ల నమ్మకం, ధీమా కలిగించామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా శుక్రవారం నాడిక్కడ జరిగిన ర్యాలీలో మాట్లాడిన మోదీ దేశ ఆర్థిక స్థితిగతులు, నోట్ల రద్దు, ప్రజల జీవన విధానం సహా అనేక అంశాలను విస్తృతంగా ప్రస్తావించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అత్యంత కఠినమైనదని, అయినప్పటికీ దేశ ప్రజలంతా తనకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. 125 కోట్ల మంది భారత ప్రజలు బలంగా తమతో ఉండటం వల్లే ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో కఠినమైన, సంక్లిష్టమైన నిర్ణయాలను దేశాభ్యున్నతి కోసం తీసుకోగలిగామని తెలిపారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతగా అలజడి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో ఈ రకమైన సమస్యలన్నింటినీ తమ ప్రభుత్వం అధిగమించగలిగిందని మోదీ తెలిపారు. ‘ప్రభుత్వపరంగా ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న మీ మద్దతు పెరుగుతూనే వచ్చింది. ఈ నిర్ణయాల పర్యవసానంగా వచ్చిన మార్పులు మీ కళ్లముందున్నాయి’ అని మోదీ అన్నారు. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే నల్లధనం అంశంపై దృష్టి పెట్టామని, దాని అంతు చూడాలని నిర్ణయించామని మోదీ గుర్తుచేశారు. అవినీతిపరులనుంచి రాబట్టిన ఈ నల్లధనం తిరిగి పేద ప్రజలకే వెళుతుందని స్పష్టం చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఈ అంశంపై వెనక్కి తగ్గేది లేదని ఉద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అస్సాం పర్యటన సందర్భంగా ఈ ర్యాలీకి ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. దేశంలోని అతి పెద్ద వంతెనగా రూపుదిద్దుకున్న భూపేన్ హజారికా బ్రిడ్జిని ప్రారంభించారు. అలాగే గౌహతిలో ఎయిమ్స్ కేంద్రాన్ని ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ఈ ర్యాలీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమేనని పునరుద్ఘాటించిన మోదీ మొక్కుబడి చర్యలవల్ల దేశ అభివృద్ధి జరగదన్నారు. తాను ఇక్కడ ప్రారంభించిన భూపేన్ హజారికా వంతెన వల్ల దేశంలోనే ఆర్థిక విప్లవం వస్తుందన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతం తనకు దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అంత ముఖ్యమని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ఇదే రోజు తనను, తన ప్రభుత్వాన్ని ఢిల్లీలో రాష్టప్రతి ఆహ్వానించారని గుర్తు చేశారు. బ్రహ్మపుత్ర నదిని కీర్తిస్తూ భూపేన్ హజారికా ఎన్నో పాటలు పాడారని, అందుకే ఈ వంతెనకు ఆయన పేరు పెట్టామన్నారు. దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాలన్న కలల సాకారంలో భాగంగానే ఈ రకమైన ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓబిసిల అభ్యున్నతికి చర్యలు చేపట్టామని, ఓ కమిషన్‌ను ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. స్వచ్ఛ్భారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని, ముఖ్యంగా ఈ సందేశాన్ని బలంగా అందించిన మీడియా పాత్ర నిరుపమానమని తెలిపారు. పేదరికంలో పుట్టి దేశం కోసం ఏదో చేయాలని కలలుగన్న జీవితం తనదని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. క్యూల చివరలో నుంచున్న అతి సామాన్యమైన జీవితం తనదని తెలిపారు. ప్రధానిగా తొలిసారి ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు తాను టాయిలెట్ల గురించి ప్రస్తావించడం చాలామందికి విస్మయాన్ని కలిగించిందన్నారు. కారణం అంతకుముందు ఈ చారిత్రక ప్రదేశం నుంచి అదే స్థాయి ప్రసంగాలు రావడమేనని తెలిపారు. ప్రతిరోజూ తమ పాలన ఓ నవోదయమేనని, ప్రతిరోజూ ఓ కొత్త పథకంతో జన క్షేమాన్ని కోరి ముందుకు వస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వాటిని అమలుచేయడంలోనూ ఎలాంటి జాప్యం లేదని, ఉద్యోగులు సమయానికి హాజరవుతున్నారని అన్నారు.

చిత్రం... అసోం-అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై 9.15 కిలోమీటర్ల పొడవున నిర్మించిన వంతెనను జాతికి అంకితం చేసి, వారధిపై నడుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ