జాతీయ వార్తలు

సూపర్ కాప్ గిల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: పంజాబ్ మాజీ డీజీపీ కెపిఎస్ గిల్ శుక్రవారం కన్నుమూశారు. మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్టు ఆస్పత్రి నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ రాణా ఒక ప్రకటనలో తెలిపారు. గిల్ వయస్సు 82 ఏళ్లు. 1935లో జన్మించిన కన్వర్‌పాల్ సింగ్ గిల్ రెండుసార్లు పంజాబ్ పోలీసు చీఫ్‌గా వ్యవహరించారు. పంజాబ్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులను కూకటి వేళ్లతో అంతమొందించడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ‘సూపర్‌కాప్’గా గుర్తింపు పొందారు.