జాతీయ వార్తలు

ఇవిఎం చాలెంజ్‌కి ఎన్‌సిపి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఎన్నికల కమిషన్ జూన్ 3న నిర్వహించే ఇవిఎంల చాలెంజ్‌లో కేవలం శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మాత్రమే పాల్గొంటోంది. ఆమ్ ఆద్మీ, బిఎస్పీ సహా పలు పార్టీలు చేసిన ఇవిఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తిప్పికొట్టడానికి ఇసి ప్రకటించిన ఇవిఎంల చాలెంజ్ జూన్ 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య జరుగనుంది. ఇవిఎం చాలెంజ్‌లో పాల్గొనాలన్న ఇసి ఆహ్వానానికి మొత్తం 8 పార్టీలు స్పందించినట్టు ఇసి ప్రతినిధి చెప్పారు. మిగతా పార్టీలన్నీ రకరకాల కారణాలు చూపుతూ చాలెంజ్‌లో పాల్గొనడానికి అయిష్టత వ్యక్తం చేశాయి. ఈ చాలెంజ్‌లో పాల్గొనడానికి సంసిద్ధత తెలియజేసిన పార్టీ ఎన్‌సిపి ఒక్కటేనని, సిపిఐ, సిపిఎం, బిజెపి, ఆర్‌ఎల్‌డిలు చాలెంజ్‌ను పరిశీలించడానికి మాత్రమే ఆసక్తి చూపించాయని ఆయన తెలిపారు. ఇవిఎం చాలెంజ్ కోసం ఎన్‌సిపి ముగ్గురు ప్రతినిధులను నామినేట్ చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఆపార్టీ నాలుగు ఇవిఎంలను ఎంచుకోవాల్సి ఉండగా, ఆ పార్టీ ఇసి ఇష్టానికే వదిలిపెట్టింది. కాగా, జూన్ 3న చాలెంజ్‌ని నిర్వహించడం కోసం ఇసి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పంజాబ్, యుపి, ఉత్తరాఖండ్‌ల నుంచి కొన్ని ఇవిఎంలను తెప్పిస్తోంది.