జాతీయ వార్తలు

కబేళాలకు పశు విక్రయాలపై కేంద్రం నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయ అవసరాలకే పరిమితం
కొనుగోలుదారుల
హామీప్రతం తప్పనిసరి

న్యూఢిల్లీ, మే 26: వధ కోసం కబేళాలకు పశువుల (ఎద్దులు, ఆంబోతులు, ఆవులు, గేదెలు, దూడలు, ఒంటెలు) విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పర్యావరణ శాఖ ఈమేరకు శుక్రవారం కొత్త నియమాలను ప్రకటించింది. పశువులను కేవలం వ్యవసాయ పనులకే విక్రయించాలని కేంద్రం కొత్త నియమాల్లో స్పష్టం చేసింది. కొత్త నియమాల ప్రకారం పశువులు అంటే ఎద్దులు, ఆంబోతులు, ఆవులు, గేదెలు, దున్నపోతులు, దూడలు, ఒంటెల విక్రయం ఇకమీదట అత్యంత జటిలమైన వ్యవహారంగా మారనుంది. పశువుల పట్ల క్రూరత్వాన్ని అదుపు చేసేందుకే అన్ని పశువుల సంతల్లో పశువులను వధ కోసం విక్రయించటాన్ని నిషేధిస్తున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ తమ ఆదేశంలో పేర్కొంది. ఇకమీదట పశువులను కొనుగోలు చేసే సమయంలో వీటిని కేవలం వ్యవసాయ పనులకే తీసుకుంటున్నాం తప్ప వధ కోసం కాదనే హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పశువుల సంతల్లో పశువులను కొనుగోలు చేసేందుకు ఇక మీదట రకరకాల పత్రాలను నింపాల్సి ఉంటుందని, పత్రాలకు సంబంధించిన పని పూర్తి అయితేనే విక్రయం పూరె్తైనట్టని కేంద్రం స్పష్టం చేసింది. పశువుల కొనుగోలు, విక్రయానికి సంబంధించిన ఐదు పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని, వివిధ స్థాయిలలో స్థానిక అధికారులకు ఈ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. పశువులను విక్రయించాలని అనుకునేవారు తమ ధ్రువపత్రాలు, గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మార్కెట్ కమిటీ ఈ పత్రాలను పరిశీలించి ఆమోదించిన తరువాతే సదరు పశువులను విక్రయించేందుకు, కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. కొనుగోలు చేసిన పశువులను తర్వాత ఆరు నెలల కాలంలో విక్రయించటం జరగదనే హామీపత్రాన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.
పశువులు ముఖ్యంగా ఆవుల విక్రయంపై దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పశువుల వధను నిషేధించకున్నా వధ కోసం విక్రయాన్ని నిషేధించటం ద్వారా కేంద్రం పరోక్ష పద్ధతిలో పశువుల వధను నిషేధించిందని చెప్పక తప్పదు. ఇదిలావుంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారనుంది. మైనారిటీలను దెబ్బ తీసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.