జాతీయ వార్తలు

నాది నిక్కచ్చి లెక్క.. నా వ్యాఖ్యలకు కట్టుబడివున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా వ్యాఖ్యలకు కట్టుబడివున్నా

అబద్ధాలనుకుంటే నిరూపించండి
కెసిఆర్‌కు అమిత్ షా సవాలు

న్యూఢిల్లీ, మే 26: తెలంగాణ పర్యటనలో తానుచేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పునరుద్ఘాటించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని మీడియా ప్రశ్నించినపుడు పైవిధంగా జవాబిచ్చారు. ‘నేను చెప్పిన లెక్కలు అబద్ధాలనుకుంటే, ఆ విషయాన్ని రుజువు చేయాలి’ అని అమిత్ షా స్పష్టం చేశారు. ఏపీలో తెదేపాతో పొత్తులేకుండా ఒంటరి పోటీని కార్యకర్తలు కోరుతున్నారా? అన్న ప్రశ్నకు ‘ఒంటరి పోటీకి శ్రేణులు సూచించిన మాట వాస్తవమే. అయితే దీనిపై మిడియాముందు స్పందించలేను’ అని సమాధానమిచ్చారు. కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) అధికారంలోని వచ్చి మూడేళ్లు పూరె్తైన సందర్భంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మైలు రాళ్లు సాధించిందన్నారు. బిజెపి ప్రభుత్వం నిర్ణయాత్మకమైన ప్రభుత్వమని, విధానాల రూపకల్పనలో అనిశ్చితిని తొలగించి కీలకమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. కుటుంబ, కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలను కూకటి వేళ్ళతో పెకలించామన్నారు. ప్రధాని మోదీ మచ్చలేని మూడేళ్ల పాలన అందించారన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లోవున్న బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంలాంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందన్నారు. పెద్ద నోట్ల రద్దులాంటి సాహసోపేత నిర్ణయం ద్వారా నల్లధనం వెలికితీశామన్నారు. 2014 సాధారణ ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లో జరగిన ఎన్నికల తర్వాత బిజెపి బలం పెరిగిందని, ఎక్కువ రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రధాని మోదీ పట్ల, బిజెపీ ప్రభుత్వంపైన నమ్మకం పెరిగిందని అమిత్ వివరించారు. అలాగే ప్రపంచంలో భారతదేశం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారన్నారు. మోదీ ప్రభుత్వం పేదల, ఆదివాసీ, దళిత, మధ్య తరగతి వర్గాల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలన్నీ వారి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేసిందన్నారు. దేశంలోని అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించడం సాధ్యం కాదని, అందుకే స్వరోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.