జాతీయ వార్తలు

విపక్ష కూటమికి నితీశ్ ఝలక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం సమావేశమై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్షాల కూటమిని ఝలక్ ఇచ్చారు. రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి ఇద్దరి మధ్య మద్దతు చర్చలు సాగాయన్న ఊహాగానాలు దేశంలో కొత్త రాజకీయానికి సంకేతంగానే కనిపిస్తోంది. నిజానికి బిహార్ సిఎం నితీష్‌కుమార్‌కు దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాల్లో ఆయన చాణక్యుడు లాంటివారన్న పేరుంది. ప్రధాని నరేంద్ర మోదీకి, నితీశ్‌కు మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నిజానికి నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కారణంగా పదేళ్లుగా కొనసాగుతున్న బిజెపి- జెడి (యు) పొత్తును తెగతెంపులు చేసుకున్న వ్యక్తి ఆయన. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాకు ఎదురొడ్డి విజయం సాధించడానికి ఆయన పన్నిన మహా కూటమి వ్యూహం ఎంతగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం ద్వారా మోదీ ప్రభంజనాన్ని విజయవంతంగా తిప్పి కొట్టగలిగారు. అయితే ఇటీవలి కాలంలో నితీశ్ మళ్లీ మోదీకి దగ్గరవుతున్న సంకేతాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జెడి (యు) అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన, మహాకూటమికి గుడ్‌బై చెప్పి బిజెపితో చేతులు కలపవచ్చంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నితీశ్‌కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలుసుకోవడం ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తమ మధ్య జరిగింది కేవలం ప్రధాని, ముఖ్యమంత్రి సమావేశం మాత్రమేనని, ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని నితీశ్ అంటున్నప్పటికీ, భేటీ వెనుక ఉన్నది రాజకీయ ప్రయోజనమేనని విశే్లషకులు అంటున్నారు. వీరిద్దరు రాష్టప్రతి ఎన్నిక గురించి చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ గౌరవార్థం నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం విందు ఇచ్చారు. విందు సమావేశానికి నితీశ్‌కుమార్‌ను కూడా ఆహ్వానించారు. రాష్టప్రతి పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష అభ్యర్థి గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం ఏర్పాటు చేసిన విందు సమావేశానికి గైర్హాజరైన నితీశ్ కుమార్, శనివారం మోదీ ఏర్పాటుచేసిన విందు సమావేశానికి హాజరుకావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విందు సందర్భంగా రాష్టప్రతి ఎన్నికలో బిజెపి అభ్యర్థికి మద్దతివ్వటం గురించి నితీశ్‌తో నరేంద్ర మోదీ చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే రాష్టప్రతి ఎన్నిక గురించి ప్రధానితో చర్చించలేదని నితీశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మారిషస్ ప్రధాని గౌరవార్థం ప్రధాని తనను ఆహ్వానించారన్నారు. మారిషస్‌లో బిహార్ మూలాలవారు యాభై రెండు శాతం ఉన్నారని, అందుకే మోదీ ఇచ్చిన విందుకు హాజరైనట్టు నితీశ్ వెల్లడించారు. బిహార్‌లో బిజెపిని ఓడించడానికి ఆర్‌జెడి, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘మహా కూటమి’కి తాను దూరం అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని నితీశ్ స్పష్టం చేశారు.