తెలంగాణ

రామయ్య దర్శనానికీ సంప్రదాయ దుస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 28: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో దర్శనాలకు సంప్రదాయ వస్త్ర ధారణలో వచ్చిన వారినే అనుమతించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే అన్ని విశిష్ట సేవలతో పాటు అంతరాలయ దర్శనానికి వచ్చే వారు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
పలు ప్రముఖ దేవాలయాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ భద్రాచలంలో మాత్రం ఇది అమలు కావడం లేదు. తాజాగా ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వారినే అంతరాలయంలోకి అనుమతించాలని నిర్ణయించింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే
సుప్రభాత సేవ నుంచి రాత్రి 8.30 నిమిషాలకు జరిగే పవళింపు సేవ వరకు భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరు కావాలని సూచించారు. పురుషులైతే పంచ, ధోవతి ధరించాలని, స్ర్తిలయితే చీర, పంజాబీ డ్రెస్సులతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా ఈ విషయం తెలియకుండా దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం సమీపంలోనే తక్కువ ధరకు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా భద్రాచలం దేవస్థానంలో నిత్యం జరిగే నిత్య కల్యాణానికి హాజరయ్యే వారు కూడా సంప్రదాయ దుస్తులు ధరించకపోవడం గతంలో వివాదానికి దారితీసింది. దీనిని నివారించేందుకు అప్పట్లో సంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధన పెట్టినప్పటికీ అది అమలు కాలేదు. అయితే ఈ సారి మాత్రం సాంప్రదాయ దుస్తుల నిబంధన తప్పనిసరిగా అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత విశిష్టత కలిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సంప్రదాయ పద్ధతి అమలు కాకపోవడం పట్ల గతంలో పలువురు పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.