ఆంధ్రప్రదేశ్‌

యుగ పురుషుడు ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ పట్నం, మే 28: తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు యుగపురుషుడని, తెలుగు జాతి జీవించి ఉన్నంత కాలం, తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా మిగిలిపోతారని, అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. విశాఖలో జరుగుతున్న మహానాడులో రెండోరోజైన ఆదివారం జరిగిన సభలో మొట్టమొదటిగా యుగపురుషుడికి నివాళి అన్న అంశం పై చర్చ జరిగింది. అరుదైన ఘటనలకు ఎన్టీఆర్ పెట్టింది పేరన్నారు. సినిమాల్లో ఆయనకు ఆయనే సాటి అని, సినీరంగంలో నిన్న- నేడు- రేపు ఎన్టీఆర్‌కు ఎవ్వరూ ఎదురు లేరని చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చైతన్యం తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి అని అన్నారు. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు’ అన్న నినాదంతో పేదరిక నిర్మూలన కోసం ఎన్టీఆర్ అహరహం పనిచేశారని చంద్రబాబు చెప్పారు. పేదరికంలేని, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారని, ఆయన ఆశయాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే విషయంలో ఇప్పటికే జాప్యం జరిగిందని, దీనిపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మహానాడులో ప్రవేశపెట్టారు. రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్త నిర్వచనం చెప్పారని ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే, మేలు రత్నాన్ని గౌరవించుకోవడమేనని అన్నారు. తీర్మానాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమణ బలపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన, కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తప్పిన రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు.