జాతీయ వార్తలు

అప్రమత్తతతోనే రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రదుర్గ, మే 28: దేశ రక్షణ దళాలు గరిష్ఠ స్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ఇటీవల చోటుచేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పెఢ ధోరణిని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. భారత దేశ భౌగోలిక స్థితి గతుల దృష్ట్యా ఏ క్షణంలోనైనా ఎక్కడి నుంచైనా ముప్పు ముంచుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ‘మన పొరుగున ఉన్న దేశంతో మనకు ఏడు దశాబ్దాలుగా ఘర్షణలున్నాయి. దీని కారణంగా భద్రతాపరంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు తలెత్తుతున్నాయి’అని అన్నారు. ఆదివారంనాడిక్కడ ఏరోనాటిక్స్ టెస్ట్ రేంజ్ (ఏటిఆర్) కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. ప్రస్తుతం భౌగోళికంగా భారత్ ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా సైనిక దళాలు అనునిత్యం అప్రమత్తంగా, గరిష్ఠ స్థాయిలో సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని కీలక ప్రాంతాల్లోనూ ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జాతీయ భద్రత మరింత ఇనుమడిస్తుందని చెప్పారు.