జాతీయ వార్తలు

జైట్లీని కలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణం పనులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించటం లేదని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడుతో చెప్పారు. ఆయన సోమవారం నితిన్ గడ్కరీతో సమావేశమై ఏపీకి సంబంధించిన ఉపరితల రవాణా ప్రాజెక్టు పనితీరును సమీక్షించారు.
అమరావతి బాహ్య వలయ రహదారుల ప్రాజెక్టుకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించనందున ఈ అంశం గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చించాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. అమరావతి బాహ్యవలయ రహదారి సాధ్యాసాధ్యాలకు సంబంధించిన తుది నివేదిక ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి వస్తుందని, అది వచ్చిన తరువాత దీని గురించి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నదని గడ్కరీ పేర్కొన్నారు. సాగరమాల, బకింగ్‌హం కాలువ పనుల పునరుద్ధరణ, జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, అమరావతి వలయాకార రహదారి నిర్మాణం ప్రాజెక్టుల గురించి వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ సమీక్షించారు. సాగర్‌మాల, బకింగ్‌హం కాలువ ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లు తయారైన తరువాత మిగిలిన అంశాలు చేపడతామని గడ్కరీ చెప్పారు. భారత్‌మాల పథకం కింద ఏపీలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల డిపిఆర్‌లు డిసెంబర్ నాటికి ఆందుతాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణానికి నిధులు సమకూర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందంటూ ఈ ప్రాజెక్టుకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు సుముఖత చూపించటం లేదన్నారు. నందిగామ-కంచికచర్ల బైపాస్, నాలుగు వరుసల రహదారుల విస్తరణ, పదహారవ నంబర్ జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణ పనులు, రాజమండ్రి-మొరంపూడి జంక్షన్ వద్ద వంతెన నిర్మాణం, నాలుగో నెంబర్ జాతీయ జల రహదారికి నిధుల సమీకరణ, జాతీయ రహదారి నంబర్ 5లో విజయవాడ-గుండుగొలనుల మధ్య రహదారిని ఆరు వరుసల విస్తరణకు ఇపిసి విధానంలో చేపట్టేందుకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనపై ఇరువురు మంత్రులు లోతుగా సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై పలు ముఖ్యమైన కూడళ్ల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ఇరువురు మంత్రులు సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి వెంటనే పనులు చేపట్టాలని వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రికి సూచించారు. ఆధునిక సౌకర్యాలతోకూడిన డ్రైవింగ్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బూటిఫికేషన్ కార్పోరేషన్‌కు నిధుల విడుదల గురించి కూడా ఇరువురు మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షా సమావేశానికి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గాబా, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు యుద్‌వీర్‌సింగ్ మాలిక్‌తోసహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.