జాతీయ వార్తలు

మరో ఆరు విమానాశ్రయాల్లో హ్యాండ్ బ్యాగ్‌లకు ట్యాగ్‌లుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: పాట్నా, చెన్నై విమానాశ్రయాలు సహా దేశంలోని మరో ఆరు విమానాశ్రయాలు జూన్ 1వ తేదీ నుంచి దేశీయ ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్‌లకు ట్యాగ్‌లు, స్టాంపింగ్‌లు వేసే పద్ధతికి స్వస్తి పలకనున్నాయి. వీటిలో పాట్నా, చెన్నై విమానాశ్రయాలతో పాటు జైపూర్, గౌహతి, లక్నో, త్రివేండ్రం విమానాశ్రయాలు ఉన్నాయని సిఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపి.సింగ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. దేశీయ ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్‌లకు ట్యాగ్‌లు, స్టాంపింగ్‌లు వేసే పద్ధతికి తెరదించే ప్రక్రియలో భాగంగా ఈ ఆరు విమానాశ్రయాల్లో కొద్ది వారాల పాటు ట్రయల్స్ నిర్వహిస్తామని, జూన్ 1వ తేదీ నుంచి ఈ ట్రయల్స్ ప్రారంభమవుతాయని, ఆ తర్వాత మరిన్ని సరికొత్త గాడ్జెట్లను, సిసిటీవీలను, ఇతర భద్రతా పరికరాలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. దేశంలో 59 విమానాశ్రయాలకు భద్రత కల్పిస్తున్న సిఐఎస్‌ఎఫ్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబయి, కొచ్చిన్, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ కొత్తపద్ధతిని ప్రారంభించింది. తదుపరి దశలో విశాఖపట్నం, వారణాసి, పుణె, గోవా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టనున్నట్లు సిఐఎస్‌ఎఫ్ డిజి తెలిపారు.