జాతీయ వార్తలు

ఉగ్రవాదం పెనుసవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, మే 29: అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఐరోపా గురుతర పాత్ర పోషించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాలుగా ఉగ్రవాదాన్ని అభివర్ణించిన ఆయన, ఈ విషయంలో ఐరోపా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జర్మనీ పత్రిక హాండెల్ బ్లాట్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలను అంతర్జాతీయ, ప్రాంతీయ సవాళ్లను ఆయన ప్రస్తావించారు. జర్మనీ, ఫ్రాన్స్, యుకె, స్వీడన్ ఇటీవల ఉగ్రవాద దాడులకు గురైన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరు రోజులపాటు జర్మనీ, స్పెయిల్, రష్యా, ఫ్రాన్స్‌లలో పర్యటకు బయలుదేరిన మోదీ తొలి అడుగుగా సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బెర్లిన్ చేరుకున్నారు.
జర్మనీతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మరో కొత్త అధ్యాయం అంకురించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేయగలదని, ఉభయతారకమైన ప్రయోజనాలను అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బెర్లిన్‌లో దిగిన వెంటనే ఆంగ్లంలోనూ, జర్మనీ భాషలోనూ ట్వీట్ చేశారు. భారత్‌కు జర్మనీ అత్యంత ప్రాధాన్యత కలిగిన మిత్రదేశమని పేర్కొన్న మోదీ చాన్సలర్ మెర్కెల్‌లో తాను అనేక అంశాలపై జరపబోయే చర్చలు ద్వైపాక్షిక బంధాన్ని మరింత ఇనుమడింపచేయగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పరివర్తనా శకానికి జర్మనీ అన్ని విధాలుగా సరిపోతుందని వెల్లడించారు. మంగళవారం మెర్కెల్‌లో తాను జరపబోయే చర్చలు వ్యాపార, వాణిజ్య అంశాలపై మరింత ముందుకు వెళ్లేందుకు దోహదం చేయగలవని అన్నారు. అలాగే సరికొత్త సహకార బంధాన్ని నిర్దేశించుకుంటూ ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లగలవన్న ధీమాను కూడా మోదీ వ్యక్తం చేశారు. భారత్, జర్మనీ అంతర్ ప్రభుత్వ ద్వైవార్షిక చర్చల నాలుగో దశలో భాగంగా మెర్కెల్‌లో మోదీ సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అలాగే దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంత ఉద్రిక్తతలు, వన్ బెల్ట్-వన్ రోడ్ ప్రాజెక్టు, ఉగ్రవాదం తదితర అంశాలపై మెర్కెల్‌తో మోదీ విస్తృతంగా చర్చలు జరపనున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన స్వేచ్ఛా వాణిజ్య ఒపందం కూడా ఈ సందర్భంగా మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశం కనిపిస్తోంది.
మోదీ మంగళవారం స్పెయిన్‌కు వెళ్తారు. మూడు దశాబ్దాలలో భారత ప్రధాని స్పెయిన్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. అక్కడ ఆయన రాజు ఫెలిప్ 6ను కలుస్తారు. అధ్యక్షుడు మరియానో రాజోయ్‌తో చర్చలు జరుపుతారు. 31న స్పెయిన్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తారు. 18వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ఇరు దేశాల సిఇఒలతో భేటీ అవుతారు. జూన్ 2న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరంలో ఈ పాల్గొంటారు. నాలుగు దేశాల పర్యటనలో చివరగా మోదీ జూన్ 2, 3 తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌తో చర్చలు జరుపుతారు.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ