జాతీయ వార్తలు

ఆంక్షలకు బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, మే 30: కబేళాల కోసం పశువుల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను మద్రాసు హైకోర్టు మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది. నాలుగు వారాలపాటు స్టే కొనసాగుతుందని పేర్కొన్న కోర్టు, ఆలోగా తమ సమాధానాలను తెలియజేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాను ఏం తినాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంది అని కోర్టు వ్యాఖ్యానించింది. పశువుల వధను అదుపు చేయడం కోసం లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించింది. తన ఆహారాన్ని ఎంచుకోవడం ప్రతి వ్యక్తి వౌలిక హక్కని పేర్కొంటూ మదురైకి చెందిన హక్కుల ఉద్యమ కార్యకర్త, మహిళా న్యాయవాది ఎస్ సెల్వ గోమతి హైకోర్టు మదురై బెంచ్‌లో ఈ పిల్‌ను దాఖలు చేశారు. కేంద్రం ఇటీవల నోటిఫై చేసిన నిబంధనలు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని కూడా ఆమె ఆ పిటిషన్‌లో వాదించారు. అంతేకాదు చట్టప్రకారం మార్కెట్లో వధకోసం పశువుల విక్రయాన్ని నిషేధించే అధికారం కేంద్రానికి లేదని కూడా ఆమె వాదించారు. అంతేకాక కొత్త నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కు, మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ హక్కులకు కూడా భంగకరమని కూడా ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పశువుల సంతల్లో వధించడం కోసం ఆవులు, గేదెలు, ఎద్దులు, ఒంటెలు సహా పశువుల కొనుగోలు, అమ్మకాలను నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతవారం కఠిన నిబంధనలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రకటించిన ఈ నిబంధనలను కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటుగా పలు రాజకీయ పార్టీలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విదితమే.