జాతీయ వార్తలు

తెలంగాణకు మరికొంతమంది సివిల్ సర్వీస్ ఉద్యోగుల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 5: తెలంగాణ రాష్ట్రానికి సివిల్ సర్వీస్ ఉద్యోగుల కేటాయింపు, పెంపు అంశాలపై డిఓపిటి అధికారులతో చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. ఇరువురు సీనియర్ అధికారులు మంగళవారం డిఓపిటి అధికారులతో చర్చలు జరిపిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
రాష్ట్ర విభజన అనంతరం సివిల్ సర్వీస్ అధికారుల కొరత ఉన్నదని వారు తెలిపారు. సివిల్ సర్వీస్ ఉద్యోగుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి తగు ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించామంటూ, ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు శాతం వరకు సివిల్ సర్వీస్ ఉద్యోగులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని రాజీవ్ శర్మ తెలిపారు. తెలంగాణకు అదనంగా 40 మంది ఐఏఎస్, 30 మంది ఐపిఎస్ అధికారులను కేటాయించే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి సివిల్ సర్వీస్ అధికారుల సంఖ్యను పెంచే విషయం ఈ నెలాఖరుకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని ఆయన భావిస్తున్నారు. సివిల్ సర్వీస్ అధికారుల కొరత మూలంగా పరిపాలనలో పలు సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు. బుధవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియాతో సమావేశమై కేంద్ర ప్రభుత్వ పథకాలు, విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరుపుతానని ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి జిఏడి కార్యదర్శి అదర్ సిన్హా కూడా హాజరయ్యారు.