జాతీయ వార్తలు

కడప ఉక్కు కర్మాగార ఏర్పాటుపై మెకాన్ సంస్థ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలతోపాటు మంచి ప్రత్యామ్నాయాలపై మెకాన్ సంస్థ నివేదిక తయారు చేసిందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. మేకాన్ సంస్థ తయారు చేసిన ఈ నివేదికపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉక్కు శాఖ తెలిపింది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీని పూర్తి చేసే లక్ష్యంతోనే ఈ నివేదికను తయారు చేయించారని ఉక్కు శాఖ తమ ప్రకటనలో తెలిపింది. కడపతోపాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్‌ను పునర్ వ్యవస్థీకరించిన అనంతరం ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ అధ్యక్షతన గత సంవత్సరం నవంబర్ 23న ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. విభజన చట్టంలో రెండు జిల్లాల్లో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు ఏం చేయాలనే అంశంపై ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే మేకాన్ సంస్థ ఈ నివేదికను సిద్ధం చేసిందని ఉక్కు శాఖ తమ ప్రకటనలో పేర్కొన్నది. మేకాన్ సంస్థ తయారు చేసిన నివేదికలోని అంశాలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది.