జాతీయ వార్తలు

ఈ ఏడాదే రామమందిరం: సుబ్రహ్మణ్యస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ఈ సంవత్సరాంతంలోపు ప్రారంభం అవుతాయని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ నెల 9న ఇక్కడ జరిగే సదస్సులో ఈ నిర్మాణం పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అయితే ప్రజాఉద్యమం ద్వారా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగదని, కోర్టు తీర్పు వెలువడిన తరువాత మాత్రమే అది జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. హిందూ, ముస్లిం మతస్థుల పరస్పర సమ్మతితో ఈ సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో కోర్టు తీర్పు వెలువడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘రామమందిరం నిర్మాణ పనులు రానున్న రెండు మూడు నెలల్లో ప్రారంభం అవుతాయని మేము భావిస్తున్నాం. ఈ సంవత్సరాంతంలోపు అయితే ఖచ్చితంగా ప్రారంభం అవుతాయి. కోర్టు తీర్పు కోసం మేము వేచిచూస్తాం’ అని ఆయన అన్నారు.
2017లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో ఈ నిర్ణయానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించగా, ‘రాముడికి ఎన్నికలతో సంబంధం పెట్టకూడదు. రాముడు అనేది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం. అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే దానికి ప్రతి హిందువు కట్టుబడి ఉన్నాడు’ అని ఆయన బదులిచ్చారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోపు నిర్ణయం తీసుకోకపోతే తరువాత ఈ అంశం లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం అవుతుందని ఆయన చెప్పారు. హిందూ, ముస్లింల మధ్య సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించడానికి కృషి జరుగుతోందని, అయోధ్యలో సరయూ నదికి ఇరు వైపులా రామమందిరం, మసీదు నిర్మించడం జరుగుతుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ‘శ్రీరామజన్మభూమి మందిరం- నెలకొన్న పరిస్థితులు’ అనే అంశంపై ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు జరుగనున్న జాతీయ సదస్సులో ఈ అంశాన్ని చర్చిస్తామని ఆయన వివరించారు. ఈ సదస్సులో 300 మంది పరిశోధకులు, విద్యావేత్తలు, పురాతత్వ శాస్తవ్రేత్తలు పాల్గొంటారని ఆయన చెప్పారు. సదస్సులో రామమందిర నిర్మాణానికి సంబంధించిన న్యాయ పరమైన అంశాలతో పాటు ఇతర అంశాల గురించి చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు.