జాతీయ వార్తలు

మక్కళ్ నీది మయ్యమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, ఫిబ్రవరి 21: తమిళ విలక్షణ నటుడు కమల్‌హసన్ ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రకటించారు. అసంఖ్యాక అభిమానుల సమక్షంలో బుధవారం ఇక్కడ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘మక్కళ్ నీదు మయ్యమ్’ (ప్రజలందరికీ న్యాయం) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఎంఎన్‌ఎం అంటే సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్ అని అర్థం. తెలుపురంగు జెండాపై ఎరుపు, నలుపు రంగులు మిళితమైన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. చేయిచేయి కలిపి ఉన్న గుర్తును జెండాపై ముద్రించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆవిర్భవ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కమల్‌హసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నేను నాయకుణ్ని కాదు.. మీ చేతిలో ఆయుధాన్ని’ అని ప్రకటించారు. తెలుపుచొక్కా, నలుపురంగు ఫ్యాంట్ ధరించిన కమల్ వేదికపై ఉల్లాసంగా కనిపించారు. తరలివచ్చిన వేలాది మంది అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య కొత్త పార్టీని ప్రకటించారు. ఆయన చిత్రాల్లో పాపులర్ డైలాగులతో కూడిన బ్యానర్లు, ఫ్లెక్సీలు సభా ప్రాంగణమంతా కనిపించాయి. ‘నమ్మవారెయే’ (మా మనిషి), నలై నమాతే అని రాసుకొచ్చిన బ్యానర్లను అభిమానులు ప్రదర్శించారు. రామేశ్వరం వెళ్లి దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం సోదరుడి ఆశీస్సులు తీసుకున్న తరువాత కమల్ సభకు హాజరయ్యారు. కాగా తమిళ రాజకీయ పార్టీలకు ద్రవిడ పేరు ఉండడం కద్దు. అయితే సంచల నటుడు కమల్ హసన్ పార్టీ పేరులో ద్రవిడ అన్న పదమే లేదు.

chitram...
రామేశ్వరంలో అభిమానులతో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న జాతీయ నటుడు కమల్