జాతీయ వార్తలు

పొంచి ఉన్న ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: భారత్ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించే భారీ భూకంపాల బారిన పడనుందా? కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని విశ్వసిస్తున్నారా? అని అడిగితే, దీనికి అవుననేదే సమాధానం. దేశంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8.0 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని హోంమంత్రిత్వ శాఖలోని భూకంపాల అధ్యయన నిపుణులు హెచ్చరించినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక బుధవారం తెలిపింది. సోమవారం మణిపూర్ కేంద్రంగా సంభవించిన భారీ భూకంపం ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసిన నేపథ్యంలో అంతకన్నా భారీ భూకంపాలు ఆ ప్రాంతాన్ని వణికించే ప్రమాదం ఉందని ఈ కథనం హెచ్చరించింది.
ఇటీవలి కాలంలో మణిపూర్‌లో సోమవారం 6.7 తీవ్రతతో, నేపాల్‌లో గత సంవత్సరం మేలో 7.3 తీవ్రతతో, సిక్కింలో 2011లో 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపాల వల్ల భూగర్భంలో టెక్టోనిక్ ప్లేట్లు కదిలిపోయాయి. ఈ ప్లేట్లు ఇటీవలి ప్రకంపనల సందర్భంగా పగుళ్లు తేలాయని ఆ కథనం తెలిపింది. దీనికి మరిన్ని అంశాలు తోడయి కనీసం 8.0 తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పారు. ఈ తీవ్రతతో సంభవించే భూకంపం హిమాలయ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరించారు. అందువల్ల ఈశాన్య భారతానికి ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు భారీ భూకంపాల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం) హెచ్చరించింది. నేపాల్, భూటాన్, మైన్మార్, భారతదేశ భూభాగాలను అనుసంధానం చేస్తున్న భూ పలకాల వల్ల భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని, దీనివల్ల పర్వత రాష్ట్రాలతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంటుందని, ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎన్‌ఐడిఎం డైరెక్టర్ సంతోశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ భాగం సెస్మిక్ జోన్ నాలుగు లేదా అయిదులో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులు 8.0 కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడానికి వీలుగా ఉన్నాయని యూనివర్శిటీ ఆఫ్ కొలొరాడోలో ప్రముఖ భూకంపాధ్యయన శాస్తవ్రేత్త రోజర్ బిల్‌హామ్ చెప్పారు. ఒకవేళ ఈ భూకంపం సంభవించడం ఆలస్యమైతే దాని తీవ్రత మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు.