జాతీయ వార్తలు

జిఎస్టీకి కలిసిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: జిఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సహకరించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎన్డీయే ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సోనియా అంగీకరిస్తే రెండు బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుకు జరుపుతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపాదించారు. వెంకయ్యనాయుడు గురువారం ఉదయం 10 జనపథ్ వెళ్లి సోనియాతో చర్చలు జరిపారు. జిఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లు విషయంలో కాంగ్రెస్ సూచించిన దాదాపు అన్ని మార్పులు చేర్పులను చేర్చటం జరిగింది కనుక పార్లమెంటులో ఆమోదానికి సహకరించాలని కోరారు. రియల్ ఎస్టేట్ బిల్లును కాంగ్రెస్ డిమాండ్‌మేరకు స్టాండింగ్ కమిటీకి పంపించాం. ఇప్పుడు స్టాడింగ్ కమిటీ కూడా తమ నివేదిక ఇచ్చింది. రియల్ ఎస్టేట్ బిల్లుపై కాంగ్రెస్ వ్యక్తం చేసిన పలు అంశాలకు బిల్లులో ప్రాధాన్యత ఇచ్చారని వెంకయ్య కాంగ్రెస్ అధినేత్రికి వివరించారు. రెండు బిల్లుల ఆమోదం అవసరం ఎంతో ఉందని సోనియాకు వెంకయ్య వివరించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు అంగీకరిస్తే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుకు జరుపుతామని కాంగ్రెస్ అధినేత్రికి వివరించారు. వెంకయ్య విజ్ఞప్తిని సావధానంగా విన్న సోనియా, పార్టీ సీనియర్లతో చర్చించిన అనంతరం పార్టీ విధానం తెలియజేస్తామని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం జిఎస్టీ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టులో సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చుక్కెదురు కావటంతో, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేశారు. దీంతో ప్రభుత్వం జిఎస్టీ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అంగీకరించే పక్షంలో ప్రభుత్వం రెండు బిల్లులను బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం పొందాలనే తొందరలో ఉంది.