జాతీయ వార్తలు

విభజన సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచటం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు భద్రాచలం డివిజన్ గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయటం, రాజ్యసభ సభ్యులను మార్చటం గురించి న్యాయశాఖతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. పార్లమెంటులో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరవు, లోక్‌సభ సభ్యుడు బి.వినోద్‌కుమార్ గురువారం వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి ఈ అంశాలపై అట్టార్నీ జనరల్‌తో చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఐదు గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయాలి, దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని కేశవరావు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల మూలంగా సీట్లు పెంచటం సాధ్యం కావటం లేదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యులను రెండు రాష్ట్రాల మధ్య బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలను న్యాయ శాఖ సూచిస్తుందని నాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాలు అంగీకరిస్తే భద్రాచలం డివిజన్‌లోని ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు బదిలీ ప్రక్రియను కేంద్ర హోం శాఖ చేపడుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు.