అంతర్జాతీయం

లిబియా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌పై ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రిపోలి, జనవరి 7: పశ్చిమ లిబియా నగరం జ్లిటెన్‌లోని ఒక పోలీసు ట్రడైనింగ్ సెంటర్‌పై జరిగిన ట్రక్కు బాంబు దాడిలో 60 మంది మృతి చెందగా, రెట్టింపు సంఖ్యలో గాయపడినట్లు గురువారం స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే కనీసం 60 మంది చనిపోయారని, 127 మంది గాయపడ్డారని జిల్టేన్‌పై ఆధిపత్యం కలిగిన ట్రిపోలిలోని అధికారులకు అనుకూలంగా ఉండే ప్రత్యర్థి వార్తాసంస్థ తెలిపింది. కాగా, ఈ దాడి తమ పనేనంటూ ఇప్పటివరకు ఏ మిలిటెంటు సంస్థా ప్రకటించుకోలేదు. 2011లో దీర్ఘకాలం అధికారంలో కొనసాగిన నియంత మమ్మద్ గడాఫీని గద్దె దించినప్పటినుంచి లిబియాలో అరాచక పరిస్థితులు కొనసాగుతూ ఉండడమే కాకుండా రోజురోజుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు పలుకుబడి పెరుగుతోంది. కాగా, ఈ పేలుడు ఆత్మహుతి దాడి అని లిబియాలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మార్టిన్ కోబ్లర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జ్లిటెన్‌లో జరిగిన తీవ్రమైన దాడిని ఖండిస్తున్నానని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి అందరూ ఒక్కటి కావాలని లిబియా ప్రజలకు పిలుపునిస్తున్నానని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 2014 ఆగస్టులో ఇస్లామిక్ తీవ్రవాదుల మద్దతున్న మిలీషియా అలయెన్స్ ట్రిపోలిని తన అధీనంలోకి తీసుకున్నప్పటినుంచి లిబియాలో పోటీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాగా, గత డిసెంబర్‌లో అంగీకరించిన అధికార పంపిణీ ఒప్పందాన్ని అంగీకరించాలని ఐక్యరాజ్య సమితి ఇరుపక్షాలపై ఒత్తిడి తెస్తోంది.