జాతీయ వార్తలు

ఇన్‌క్రెడిబుల్ ఇండియా అంబాసిడర్‌గా బచ్చన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 7: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’లో ఇక అమీర్ ఖాన్ కనిపించడు. ఆయన స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను చేర్చవచ్చని తెలుస్తోంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ బుధవారం ముంబయిలో మాట్లాడుతూ తమ శాఖకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అమీర్ ఖాన్‌తో కాంట్రాక్టు ముగిసిందని, ఇక ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’లో ఆయన కనిపించరని తెలిపారు. మెక్కాన్ ఏజెన్సీ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అతిథి దేవోభవ’ కార్యక్రమం కాంట్రాక్టు కూడా ముగిసిందని, ఆ ఏజెన్సీ తరఫున అమీర్ ఖాన్ పనిచేశారని ఆయన తెలిపారు. దీంతో మంత్రిత్వ శాఖకు సంబంధం లేదని మహేశ్ శర్మ వివరించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా: అమీర్‌ఖాన్
ఇన్‌క్రెడిబుల్ ఇండియాతో తన కాంట్రాక్టు ముగిసిందని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను గౌరవిస్తున్నట్లు అమీర్‌ఖాన్ తెలిపారు. నాతో కాంట్రాక్టు ముగిసిందని, అయితే ఇన్‌క్రెడిబుల్ ఇండియా మాత్రం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ‘సత్యమేవ జయతే’ టీవీ షో ద్వారా విపరీతమైన ప్రచారం సంపాదించుకున్న అమీర్ ఖాన్ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యకర్తగా ప్రాముఖ్యత సంపాదించుకున్నారు. అయితే ఇటీవల భారత్‌లో అసహనం పెరిగిపోతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాద్దాంతం జరగడం అనేక మంది అమీర్‌ఖాన్ వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే.

పోస్టుమార్టంకు
ఉగ్రవాదుల శవాలు
పఠాన్‌కోట్, జనవరి 7: ఎయిర్‌బేస్‌పై దాడి ఘటనకు సంబంధించి నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. భద్రతా సిబ్బంది ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. ఎయిర్‌బేస్‌లో చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ముగింపుదశకు చేరుకుంది. అయితే నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలు మాత్రమే చెక్కుచెదరకుండా ఉండంతో సివిల్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదుల మృతదేశాలు పేలుళ్లలో ముక్కలైపోయాయి. నిపుణులైన వైద్యబృందం ఉగ్రవాదుల మృతదేహాలను పరీక్షలు నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు. ఇలా ఉండగా ఎయిర్‌బేస్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. ఈ పని త్వరగానే పూర్తయిపోతుందని పఠాన్‌కోట్ సీనియర్ సూపరింటిండెంట్ ఆర్.కె.్భక్షి వెల్లడించారు. అయితే కూంబింగ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉందని భద్రతాధికారులు స్పష్టం చేశారు. ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులెవరూ లేరని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇంతకుముందే ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉండవచ్చన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఐఏ బృందాలకు సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లేబొరెటరీ టీమ్ సహకరిస్తోంది.