జాతీయ వార్తలు

‘యూటర్న్’లతో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరును కాంగ్రెస్ పార్టీ గురువారం తీవ్రంగా దుయ్యబడుతూ, భారత్‌ను ఇబ్బందికి గురిచేయడం మానుకోవాలని ఆయనకు సలహా ఇచ్చింది. అంతేకాదు, పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో చర్చలకు సంబంధించి వేచి చూసే విధానాన్ని అనుసరించాలని ఆయనకు సూచించింది. మోదీ ప్రభుత్వం హటాత్తుగా యు టర్న్‌లు తీసుకోవడంలో ఆరితేరిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కపిల్ సిబల్ అంటూ, అయితే అలాంటి యు టర్న్‌లు ప్రమాదానికి దారి తీస్తాయన్న విషయాన్ని గ్రహించడం లేదన్నారు. ‘అందువల్లనే పఠాన్‌కోట్ పరేషాన్ కోట్‌గా మారింది’ అని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని హటాత్తుగా లాహోర్ సందర్శించడం, విదేశాంగ విధానానికి సంబంధించి తీసుకున్న మరికొన్ని చర్యలను సిబల్ తప్పుబడుతూ, ప్రధాని మోదీ చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోకుండా చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారని అన్నారు. ‘చరిత్ర సృష్టించాలని అనుకోవడానికి బదులు మోదీ చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఒకసారి దెబ్బతింటే రెండుసార్లు ఆలోచించాలనేది సామెత. పాకిస్తాన్ మనల్ని ఒక్కసారి కాదు ఎన్నోసార్లు కాటేసింది. అయినా పాకిస్తాన్‌తో వ్యవహరించే విషయంలో అపరిపక్వత ప్రదర్శించడం ద్వారా ప్రధాని పదవిని అవమానించారు. పాకిస్తాన్‌పై ప్రభుత్వానికి సమగ్రమైన విధానం ఏదీ లేదు. సీమాంతర చొరబాట్లను అది ఆపలేక పోయింది. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఈ చొరబాట్లు వెయ్యిని మించి పోయాయి’ అని సిబల్ అన్నారు.
ప్రధాని మోదీ పాక్ ప్రధానిని ఉఫాలో, ఆ తర్వాత పారిస్‌లో, మూడోసారి నవాజ్ షరీఫ్ పుట్టిన రోజుకు, ఆయన కుటుంబంలో వివాహం కోసం ఆతిథిగా లాహోర్‌లో కలిసిన విషయాన్ని సిబల్ గుర్తు చేస్తూ, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా అలాంటి అనధికారిక ఆహ్వానాలను అంగీకరించడం ప్రధానిలాంటి వారికి తగదని, అందుకే మరోసారి పాకిస్తాన్ పఠాన్‌కోట్‌లో వెన్నుపోటు పొడిచిందని అన్నారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత నవాజ్ షరీఫ్ మాటల్లో నిజాయితీ కనిపించడం లేదని అంటూ, మన దేశం పాకిస్తాన్‌కు అలాంటి డాక్యుమెంట్లను చాలాసార్లు ఇచ్చిందని, అందువల్ల పాకిస్తాన్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
పాక్‌తో చర్చలు కొనసాగించాలి: లెఫ్ట్
పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను భారత్ కొనసాగించాని, ఎందుకంటే ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం వల్ల వ్యూహాత్మకంగా భారత్‌కున్న అవకాశాలు దెబ్బతింటాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అభిప్రాయ పడ్డాయి. ‘బిజెపి ప్రభుత్వం చర్చల ప్రక్రియను కొనసాగించాలి. లేకపోతే ఉగ్రవాద జిహాదీ ముఠాలు పైచేయి సాదిస్తాయి. చర్చలకోసం రూపొందించిన టైమ్ టేబుల్‌కు కట్టుబడి ఉండడంతో పాటు ఉగ్రవాదం అంవానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి’ అని సిపిఎం మాజీ ప్రదాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’లో రాసిన సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. చర్చలపై నిర్ణయం మార్చుకుంటే అది భారత దేశ వ్యూహాత్మక అవకాశాలు దెబ్బతినడమే కాక, తిరిగి ఘర్షణ వాతావరణం తలెత్తుతుందని, ఫలితంగా భారత దేశ ఆర్థిక రికవరీ, పురోగతి దెబ్బ తింటాయని ఆయన అభిప్రాయపడ్డారు. సిపిఐ కూడా పాక్‌తో చర్చలను కొనసాగించాలనే సిపిఎం అభిప్రాయంతో ఏకీభవిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని దేశీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవాలని అనుకుంటోందా, లేక వేరెవరికోసమో చెప్పాలని డిమాండ్ చేసింది.